Share News

కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి

ABN , Publish Date - Nov 15 , 2025 | 12:33 AM

కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, మిల్లులకు తరలించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. మెట్‌పల్లి మండలంలోని ఆత్మనగర్‌, ఆత్మకూరు, జగ్గసాగర్‌ గ్రామాల్లో, ఇబ్రహీంపట్నం మండలంలోని అమ్మకపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి
మెట్‌పల్లి మండలం ఆత్మకూరులో కొనుగోలు కేంద్రంలో సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ సత్యప్రసాద్‌

- కలెక్టర్‌ సత్యప్రసాద్‌

మెట్‌పల్లి రూరల్‌/ఇబ్రహీంపట్నం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, మిల్లులకు తరలించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. మెట్‌పల్లి మండలంలోని ఆత్మనగర్‌, ఆత్మకూరు, జగ్గసాగర్‌ గ్రామాల్లో, ఇబ్రహీంపట్నం మండలంలోని అమ్మకపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తేమ వచ్చిన ధాన్యాన్ని వెంటనే కాంటా వేసి, రైస్‌మిల్లులకు తరలించాలన్నారు. కొనుగోలు వివరాలను ఆనలైనలో నమోదు చేయాలని, రైతులకు 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా చూడాలని ఆదేశించారు. రైతులకు అవసరమైన టార్ఫాలిన, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలన్నారు. మిల్లుల వద్ద లారీలను పెండింగ్‌ ఉంచకుండా ఎప్పటికప్పుడు దించుకొని, లోడింగ్‌ సమస్యలు లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. గ్రేడ్‌ ఏ ధాన్యానికి రూ.2,389, కాగా బి గ్రేడ్‌కు రూ.2369 మద్దతు ధర మీద కొనుగోలు చేయాలని సూచించారు. రైతులను డబ్బులు ఎవరూ అడిగినా ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. అధికారులు కొనుగోలు కేంద్రాలను సందర్శించి, రైతుల ఇబ్బందులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయనవెంట మెట్‌పల్లి ఆర్డీఓ శ్రీనివాస్‌, డీఆర్‌డీవో రఘువరన, తహసీల్దార్‌ నీత, ఆర్‌ఐ ఉమేష్‌, కాంతయ్య, సీఈవో తిరుపతి, ఏవో దీపిక, ఏపీఎం అశోక్‌, సీసీలు అశోక్‌, సూరయ్య, కేంద్ర నిర్వహకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 12:33 AM