Share News

పారిశుధ్య కార్మికుల రక్షణ, భద్రత అందరి బాధ్యత

ABN , Publish Date - May 16 , 2025 | 12:10 AM

పారిశుధ్య కార్మికుల రక్షణ, భద్రత, గౌరవం కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని డీఆర్డీవో శేషాద్రి అన్నారు.

పారిశుధ్య కార్మికుల రక్షణ, భద్రత అందరి బాధ్యత

సిరిసిల్ల కలెక్టరేట్‌, మే 15 (ఆంధ్రజ్యోతి) : పారిశుధ్య కార్మికుల రక్షణ, భద్రత, గౌరవం కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని డీఆర్డీవో శేషాద్రి అన్నారు. యూనిసెఫ్‌, స్వచభారత్‌ సమన్వయంతో పారిశుధ్య కార్మికుల రక్షణ, భద్రత, గౌరవం అనే అంశంపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లాలోని ఆయా మండలాల ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించగా, డీఆర్డీఓ శేషాద్రి హాజరై మాట్లాడారు. గ్రామాల్లో చెత్త నిర్వహణ, సేంద్రీయ ఎరువు తయారీ, తదితర అంశాలపై పనిచేస్తున్న పారిశుధ్య కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉద్ఘాటించారు. పారిశుధ్య కార్మికులకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన, ఇష్టమైన రీతిలో పని చేసేందుకు సరైన వాతావరణం ఏర్పాటు చేయాలని యూనిసెఫ్‌ శిక్షకుడు ఫణీంద్ర తెలిపారు. పారిశుధ్య కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలని, తరచుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, రక్షణ కవచాలు ఇచ్చి వాడేలా అవగాహన కలిఁంచాలని సూచించారు. దీంతో కార్మికుల, వారి కుటుంబ సభ్యుల భద్రతకు చేయూత ఇస్తుందని యూనిసెఫ్‌ సమన్వయకర్త కిషన్‌ స్వామి తెలిపారు. ప్రతి ఇంటి స్థాయిలో తడి, పొడి చెత్త వేరు, కంపోస్ట్‌ షెడ్ల వినియోగం, ఎరువు తయారీ, చెత్త నుంచి సంపద తయారీ తదితర అంశాలపై స్వచ్ఛభారత్‌ శిక్షకుడు రమేష్‌ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లాలో సామూహిక ఇంకుడు గుంతలు, పైప్‌ కంపోస్ట్‌ పద్ధతులు, విజయగాధలపై సిరిసిల్ల స్వచ్చ భారత్‌ కో ఆర్డినేటర్‌ సురేష్‌ వివరించారు. అనంతరం ఉత్తమ సేవలు అందిస్తున్న జిల్లాలోని పలువురు పారిశుధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీవో నరేష్‌, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, కార్మికులు, ఎస్బీఎం కన్సల్టెంట్‌ ప్రేమ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2025 | 12:10 AM