Share News

లింగ నిర్ధారణలతో బాలికల నిష్పత్తి తగ్గిపోతోంది..

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:02 AM

లింగ నిర్ధారణలతో బాలి కల నిష్పత్తి తగ్గిపోతోందని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీనారాయణ అన్నా రు.

లింగ నిర్ధారణలతో బాలికల నిష్పత్తి తగ్గిపోతోంది..

సిరిసిల్ల టౌన్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : లింగ నిర్ధారణలతో బాలి కల నిష్పత్తి తగ్గిపోతోందని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీనారాయణ అన్నా రు. గురువారం సీడీపీవో సిరిసిల్ల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలలో, విద్యాలయాలలో బాలల హక్కుల వారోత్సవాలలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా అంగన్‌వాడీ కేంద్రాలలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న ఆహార పదా ర్థాల నాణ్యతను జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీనారాయణ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగ నిర్ధారణ, గర్భవిచ్ఛితికి పాల్ప డడం వల్ల బాలికల నిష్పత్తి తగ్గిపోతోందన్నారు. ఇది చాలా దుష్పరిణా మానికి దారితీస్తుందని, భవిష్యత్తులో సమాజంపై అనర్థాలకు దారి తీస్తుందన్నారు. అనంతరం విద్యా హక్కు, ఆహార భద్రత, గర్భిణులు తీసు కొనే ఆహారంపై అవగాహన కల్పించారు. అనంతరం రంగినేని ట్రస్టులో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వయోవృద్ధులతో సమావేశం అయ్యారు. ఖాతాలు ఉన్న బ్యాంకులు దూరంగా ఉండడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని వృద్ధులు తెలపడంతో స్పందించిన జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీనారాయణ ఎస్‌బీఐ అధికారులతో మాట్లాడి ఎస్‌బీ ఐలో ఖాతాలు ఇవ్వాలని కోరారు. వృద్ధుల సమస్యలను ఆరా తీశారు. అనంతరం తంగళ్లపల్లి ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ కళాశాలలో బేటీ బచావ్‌, బేటి పడావో కార్యమ్రంలో పాల్గొన్నారు. విద్యార్థులకు బాల్య వివా హాల వలన కలిగే దుష్పరిణామాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ దివ్య, డీసీపీవో కవిత, డీహబ్‌ కో ఆర్డి నేటర్‌ రోజా, ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ప్రిన్సిపల్‌ జి జయ, ప్రభుత్వ వృద్ధుల ఆశ్రమం కోఆర్డినేటర్‌ మమత పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 12:02 AM