కన్నులపండువగా మార్కండేయ స్వామి శోభాయాత్ర
ABN , Publish Date - Aug 10 , 2025 | 01:20 AM
శివభక్త మార్కండేయ స్వామి నామస్మరణ... శివహోం... అంటూ తరలివచ్చిన పద్మశాలీల జనసందోహం మధ్య కన్నుల పండువగా మార్కండేయ స్వామి శోభాయాత్ర శోభి ల్లింది.
సిరిసిల్ల ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) : శివభక్త మార్కండేయ స్వామి నామస్మరణ... శివహోం... అంటూ తరలివచ్చిన పద్మశాలీల జనసందోహం మధ్య కన్నుల పండువగా మార్కండేయ స్వామి శోభాయాత్ర శోభి ల్లింది. ఎటు చూసినా శోభాయమానం స్వామివారి యాత్ర కన్నుల పం డువగా సాగింది. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మార్కండేయ స్వామి దేవా లయం నుంచి బయలుదేరిన మార్కండేయ స్వామి రథయాత్ర... మగ్గం ప్రదర్శనతో సాగిపోయింది. శోభాయాత్రకు వందలాది మంది పద్మశాలీ లు తరలివచ్చారు. శనివారం సిరిసిల్ల పద్మశాలీ సంఘం, యువజన, మహిళ పంఘం ఆధ్వర్యంలో నూలు పౌర్లమి సందర్భంగా మా ర్కండేయ దేవస్థానం నుంచి ప్రత్యేక అలంకరణలతో మార్కం డేయ స్వామి రథం ముందు సాగిపోతుండగా వెనకాలే ట్రాక్ట ర్‌పైనా మగ్గంపై కార్మికుడు కండువా నేస్తూ ప్రదర్శన నిర్వ హించారు. సిరిసిల్ల పట్టణ ప్రజలందరు శోభాయాత్రకు తరలి వచ్చారు. గాంధీచౌక్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా చేనేత చౌక్ మీదుగా శోభాయత్ర సాగింది. గాంధీ, అంబేద్కర్, నేతన్న విగ్రహాలకు ప్రభుత్వ బిప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి పద్మశాలి ప్రతిని ధులు మగ్గంపైన నేసిన కండువతో పాటు పూలమాలలు వేశారు. పద్మశాలి మహిళ ప్రతినిదులు ఆది శ్రీనివాస్‌కు రాఖీ కట్టారు. ఉదయమే మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి యజ్ఞోపవీత ధారణతోపాటు గణపతిపూజ, నవగ్ర హ ఆరాధన, గాయత్రీ హోమం, నిర్వహించారు. శోభాయాత్ర లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, టెక్స్‌టైల్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ గుడూరి ప్రవీణ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ మాజీ చైర్మన్లు జిందం కళచక్ర పాణి, అడెపు రవీందర్, పద్మశాలీ సంఘం ప్రతినిధులు మండల సత్యం, తాటిపాముల దామోదర్, దూడం శంకర్, గోవిందు రవి, ఆడెపు భాస్కర్, బొల్లి రామ్మోహన్,సంగీతం శ్రీనివాస్,డాక్టర్ గాజుల బాలయ్య, యెల్లె లక్ష్మీనారాయణ, గుండ్లపల్లి పూర్ణచందర్, మోర రవి, గెంట్యాల శ్రీనివాస్, మ్యాన రవి, వెంగళ శ్రీనివాస్, కట్టెకోల లక్ష్మీనారాయణ, అంకాలపు రవి, గుంటుక మహేష్, మధు, కాముని వనిత, గుజ్జె తార, అడెపు చంద్రకళ, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
వస్త్ర పరిశ్రమ కొత్తపుంతలు తొక్కాలి
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కొత్తపుంతలు తొక్కాలని, నేతన్నలకు ప్రభు త్వం అన్ని విధాల అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శోభాయత్రలో మాట్లాడుతూ ప్రభుత్వం నేత కుటుంబాలను ఆదుకునే దిశగా చర్యలు చేపట్టిందన్నారు. నేతన్నలను మార్కండేయ స్వామి చల్లగా చూడాలని కోరుకున్నారు.