Share News

మరమగ్గాల కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - Oct 30 , 2025 | 12:07 AM

మరమగ్గాల కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలంటూ నవంబరు 20న హైద రాబాద్‌లోని చేనేత జౌళి శాఖ కార్యాలయం ఎదుట కార్మికులతో ధర్నా చేయనున్నట్లు సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌ ప్రకటించారు.

మరమగ్గాల కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

సిరిసిల్ల రూరల్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : మరమగ్గాల కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలంటూ నవంబరు 20న హైద రాబాద్‌లోని చేనేత జౌళి శాఖ కార్యాలయం ఎదుట కార్మికులతో ధర్నా చేయనున్నట్లు సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌ ప్రకటించారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని అమృత్‌లాల్‌ శుక్లా కార్మిక భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమేష్‌ మాట్లాడుతూ మరమగ్గాల కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు వర్కర్‌ టూ ఓనర్‌ పథకాన్ని అమలు చేయడంతో పాటు ప్రభుత్వ చీరలకు యారన్‌ సబ్సిడీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మరమగ్గాల కార్మికులకు గుర్తింపు కార్డులను ఇవ్వాలన్నారు. వస్త్ర పరిశ్రమలకు విద్యుత్‌ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించి, బ్యాక్‌ బిల్లింగ్‌ వెంటనే విడుదల చేయాల న్నారు. 2023 సంవత్సరంలో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు బతుకమ్మ చీరలను తయారు చేశారని వారికి రావాల్సిన పది శాతం యారన్‌ సబ్సిడీ లను అందించాలంటూ నవంబర్‌ 20న చేపట్టే ధర్నాకు చేనేత పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర గౌరవ అఽధ్యక్షుడు చెరిపెల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్‌లు హాజరవుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్‌ 20వ తేదీలోగా కార్మికులను సమస్యలను పరిష్కరించడంతో పాటు వర్కర్‌ టూ ఓనర్‌ పథకం కింద నిర్మించిన షెడ్‌లను ఇతర వాటి కోసం వినియోగించవద్దన్నారు. ప్రస్తుతం సిరిసిల్లలో తయారు చేస్తున్న చీరలకు యారన్‌ సబ్సిడీ ప్రకటించ లేదని, దీనివల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతు న్నారని పేర్కొన్నారు. అలాగే త్రిఫ్ట్‌ పథకం అమలుచేయడంలో తీవ్ర ఆలస్యం జరుగుతోందన్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలంటూ చేపట్టనున్న ధర్నాకు కార్మికులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని రమేష్‌ కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, పట్టణ అధ్యక్షుడు నక్క దేవదాస్‌, జిల్లా నాయకులు బేజుగం సురేష్‌, స్వర్గం శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 30 , 2025 | 12:07 AM