Share News

రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Dec 24 , 2025 | 11:36 PM

పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంతో పాటు బకాయిలను విడుదల చేయాలని తెలంగాణ గవర్నమెంట్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ జేఏసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తులసీ సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంతో పాటు బకాయిలను విడుదల చేయాలని తెలంగాణ గవర్నమెంట్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ జేఏసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తులసీ సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్‌ అసోసియేషన్‌, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్‌ సంయుక్త కార్యాచరణ సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్‌ ఎదుట బుధవారం తెలంగాణ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ జేఏసీ జిల్లా కమిటీ అధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్షను చేప ట్టారు. అనంతరం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ను కలిసి సమస్యల ను విన్నవించి వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఈ దీక్షలకు హాజ రైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ 2024 మార్చి నుంచి ఇప్పటివరకు ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయుల బకాయిలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలన్నారు. పదవీవిరమణ పొంది 21 నెలలు గడుస్తున్న కూడా పదవీవిరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీపీఎఫ్‌, జీఐఎస్‌, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌, కమిటేషన్‌, గ్రాట్యూటీ ప్రభుత్వం నుంచి ఇవ్వడం లేదన్నారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వెంటనే రావాల్సిన బకాయిలు అందక రాష్ట్రంలో 32మంది ఉద్యోగస్తులు మానసిక ఆవేదనకు గురై మృతిచెందా రని తెలిపారు. ఇట్టి ప్రజయోజనాల విషయాన్ని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్న వించి, నిరసనలు, ధర్నాకార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం పట్టించుకోవడం లేద న్నారు. జిల్లా అధ్యక్షుడు మల్లారపు పురుషోత్తం మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు బకాయిలు వచ్చేంతవరకు పోరాటం చేస్తామన్నారు. దీక్షలో జిల్లా ప్రధాన కార్యదర్శి ద్యావనపెల్లి పరమేష్‌, ఉపాధ్యక్షుడు వంగ సుధా కర్‌, జనపాల శంకరయ్య, కోశాఽధికారి ధర్మయ్య, సంఘ సభ్యులు వెంకటేశ్వర్లు, ప్రభాకర్‌, సానరవీందర్‌, రెహమాన్‌, తిరుపతి, అమీరుద్దోన్‌,చొప్పదండి రవీందర్‌, రాఘవేందర్‌రావు, గడీల రమేష్‌, అనందిని, జయశ్రీ, భాగ్యరేఖ పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2025 | 11:36 PM