ఆశ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:11 AM
ఆశ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్య లను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేష్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
సుభాష్‌నగర్, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ఆశ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్య లను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేష్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022, 2023 సంవత్సరానికి సంబంధించి లెప్రసీ బిల్లులు అప్పటి డిఎంహెచ్‌వో ఆశ వర్కర్స్‌కు ఇవ్వకుండా దారి మళ్లించారని దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని, ప్రభు త్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2024 బిల్లులు పోరాటం ద్వారా సాధించుకున్నామన్నారు. అధికారులు ఆశ వర్కర్స్‌తో పనిచేయించుకోవటం తప్ప ఆదుకొనే పరిస్థితి లేదన్నారు. యూనియన జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ల శ్రీలత మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు ఒక్కో ఆశ వర్కర్‌కి 3 వేల వరకు రావాల్పి ఉంద న్నారు. ఇవ్వకుండా పని ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆశ వర్కర్స్ యూ నియన ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేయటం వల్లనే పారితోషికాలు పెంచు కున్నామన్నారు. బిల్లులు వచ్చేవరకు పోరాటం ఆపే ప్రస్తేకే లేదన్నారు. ఈ కార్యక్ర మంలో యూనియన జిల్లా అధ్యక్షురాలు కాల్వ సారిక, జిల్లా ఉపాధ్యక్షులు పద్మలత, శ్యామల, సరిత, జిల్లా సహాయ కార్యదర్శి సుమ, శ్యామల, ప్రియాంక, రజిత తదితరులు పాల్గొన్నారు.