నెరవేరుతున్న పేదవాడి సొంతింటి కల
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:16 AM
ప్రజా ప్రభుత్వంలో పేదవాడి సొంతింటి కల నెరవేరుతుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీని వాస్ అన్నారు.
వేములవాడ రూరల్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ప్రభుత్వంలో పేదవాడి సొంతింటి కల నెరవేరుతుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీని వాస్ అన్నారు. మండలంలోని పోశెట్టి పల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొ న్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసామన్నారు. వేములవాడ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల్ల నిర్మాణ పనులు శరవేగంగా జరగుతున్నాయన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని మోసం చేసిందన్నారు. ప్రజా ప్రభుత్వంలో పేద వాడి ఇంటి నిర్మాణం కోసం 5లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నామ న్నారు. నిస్సహాయులకు సహాయాన్ని అందించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వ ర్యంలో ప్రభుత్వం ముందుకుపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒకరోల్ మాడల్‌గా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమి టీ చైర్మన్ రొండి రాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వకులాభర ణం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
వేములవాడ టౌన్ : రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు అతీతంగా పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నా మని, పేద ప్రజల భ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మండలంలోని గుర్రంవానిపల్లిలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హజరై లబ్దిదారులకు నూతన వస్ర్తాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పూరి గుడిసెల్లో, రేకుల షెడ్లల్లో నివసించే వారిని ప్రభుత్వం గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. పేద ప్రజలక గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని, మళ్ళీ అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని గుర్తు చేశారు. ఇల్లు లేని పేద ప్రజల కోసం ఆలోచించి ఇల్లు కట్టి ఇవ్వాలన్న ఆలో చన చేసిన మహోన్నత వ్యక్తి ఇందిరా గాంధీని కొనియాడారు. ఈ కార్యక్ర మంలో మండల అధ్యక్షుడు పిల్లి కనుకయ్య, ఆగయ్య, సత్తయ్య, లింగయ్య తదితరులు ఉన్నారు.