Share News

అభివృద్ధి, సంక్షేమంపై ప్రజాప్రభుత్వం ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Sep 20 , 2025 | 12:15 AM

ప్రజల అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. మండలంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు.

అభివృద్ధి, సంక్షేమంపై ప్రజాప్రభుత్వం ప్రత్యేక దృష్టి
అంగన్‌వాడీ కేంద్రంను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

- చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

మల్యాల, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రజల అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. మండలంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. మండలంలోని కొండగట్టు, మల్యాల, తక్కల్లపల్లిలో శుక్రవారం అంగన్‌వాడీ నూతన భవన భవన నిర్మాణ పనులు, నూకపల్లిలో ముదిరాజు, మున్నూరుకాపు, మాల, అంబేద్కర్‌, ముత్యంపేటలో మహిళ సంఘ భవనాల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. మల్యాల రైతువేదికలో కల్యాణలక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మల్యాలలో సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ది, సంక్షేమంకు ప్రజా ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. కార్యక్రమా ల్లో ఏఎంసీ చైర్‌పర్సన్‌ బత్తిని మల్లీశ్వరీశ్రీనివాస్‌గౌడ్‌, తహసీల్దార్‌ వసంత, ఎంపీడీవో స్వాతి, విండో చైర్మ న్లు రాంలింగారెడ్డి, చంద్రశేఖర్‌ నాయకులు ఆనంద రెడ్డి, శనిగారపు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

- బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే

మల్యాల క్రాస్‌రోడ్డు వద్ద గల అల్ఫోర్స్‌ స్కూల్‌లో శుక్రవారం నిర్వహించిన ముందస్తు బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు విద్యాసంస్థల అధినేత నరేందర్‌ రెడ్డి పాల్గొని వేడుకలను ప్రారంభించారు. తెలంగాణ సంప్రదాయ వేడుకగా పేర్కొంటూ విద్యార్థులు, ఉపా ద్యాయురాళ్లతో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు.

Updated Date - Sep 20 , 2025 | 12:15 AM