రాజీ మార్గమే రాజ మార్గం
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:37 AM
రాజీ మార్గమే రాజ మార్గమని, పంతాలకు పట్టింపులకు పోయి సమయం, డబ్బు వృదా చేసుకొవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి పేర్కోన్నారు.
-జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి
-జాతీయ లోక్ అదాలత్‌లో 2,010 కేసుల పరిష్కారం
జగిత్యాల టౌన్, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): రాజీ మార్గమే రాజ మార్గమని, పంతాలకు పట్టింపులకు పోయి సమయం, డబ్బు వృదా చేసుకొవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి పేర్కోన్నారు. జగిత్యాల కోర్టులో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా 2,010 కేసులు పరిష్కారం అవగా, మూడు జంటలను కలిపారు. ఇన్సూరెన్స్, చెక్‌బౌన్స్ కేసుల్లో రూ.48 లక్షల నష్టపరిహారం చెల్లించారు. ఈసందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి మాట్లాడుతూ జిల్లాలో 17,074 కేసులు పెండింగ్‌లో ఉండగా ఇందులో 2,010 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. భార్య భర్తల కేసులకు సంబందించి మూడు జంటలకు కౌన్సెలింగ్ నిర్వహించి రాజీ కుదిర్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఫస్ట్ అడిషనల్, సెషన్ జడ్జి ఎస్.నారాయణ, సీనియర్ సివిల్ జడ్జి వెంకట మల్లిక్ సుబ్రమణ్య శర్మ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, మొదటి అదనపు జ్యూడీషి యల్ మెజిస్ర్టేట్ నికిషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందే మారుతి పాల్గొన్నారు.