Share News

రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలి

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:51 AM

వచ్చేఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్‌ విజయానికి కృషి చేయాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలి

సిరిసిల్ల, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): వచ్చేఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్‌ విజయానికి కృషి చేయాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మల్లికార్జున ఫంక్షన్‌ హాల్‌లో జిల్లా స్థాయి కాంగ్రెస్‌ పార్టీ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా కాం గ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌, సిరిసిల్ల కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డిలతో కలిసి ఓట్‌ చోరీపై రాహుల్‌ గాంధీ ప్రసంగాన్ని వీక్షించారు. రుద్రవరం సింగిల్‌విండో చైర్మన్‌ రేగులపాటి కృష్ణాదేవరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరగా వారిని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీని వాస్‌, అద్దంకి దయాకర్‌ కండువా కప్పి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానిం చారు. ఈసందర్భంగా ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నమని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థు ల విజయానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. యూరియాపై కేటీఆర్‌ ప్రభుత్వానికి కావాలనే బదునాం చేస్తున్నారని 10సంవత్సరాలు మంత్రి గా పనిచేసిన కేటీఆర్‌ కనీస సోయి లేకుండా మాట్లాడుతున్నారన్నారు. యూరియా సరఫరా కేంద్రం పరిధిలోకి వస్తుందని కానీ కేటీఆర్‌ బీజే పీపై ఎలాంటి ఆరోపణలు చేయకుండా కేవలం కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకే సపోర్ట్‌ చేస్తా అన్న చందాన మాట్లాడారని తెలిపారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా రాజకీయ చైతన్యానికి ప్రతీక అన్నారు. పీసీసీ పదవుల కోసం తీసుకున్న అప్లికేషన్లలో రాష్ట్ట్ర వ్యాప్తం గా సిరిసిల్ల జిల్లా పరిధిలో సుమారు 1700లు వచ్చాయని తెలిపారు. రానున్న రోజుల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కళ్ళలో పెట్టుకొని చూసు కుంటామని రాబోయే ప్రతి ఎన్నికల్లో వారికి గెలుపులో మేము భాగ స్వామ్యం అవుతామన్నారు. కార్యకర్తల శ్రమఫలితంగానే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ పదవుల్లో మహి ళలకు కూడా పెద్ద పీట వేస్తామన్నారు. కొత్తపాత అని తేడా లేకుండా అందరికీ అవకాశాలు వస్తాయన్నారు. బీజెపీ, బీఆర్‌ఎస్‌ రెండూ కలిసి రాష్ట్రంలో ఓటు చోరీ చేశాయన్నారు. దానికి నిదర్శనమే 2018 ఎన్నికల్లో మేము ఓడిపోవడానికి కారణమని ప్రస్తుతం గత ఎన్నికల సుప్రీం కోర్టులో కేసు ఇంకా నడుస్తుందన్నారు. షెడ్యూల్‌ ప్రకారం జరగాల్సిన ఎన్నికలను మోదీ అనుమతితో కేసీఆర్‌ ఒక సంవత్సరం ముందుగానే జరిపి ఓటు చోరీని టెస్టు చేశారన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ప్రతిపక్షాలు ఎక్కడ బలంగా ఉన్నాయో అక్కడ ఓట్ల చోరీ చేస్తూ తమకు అను కూలంగా మలుచుకుంటున్నాయన్నారు. మొన్నటి ఎన్నికల్లో చావు తప్పిలొట్ట పోయినట్లుగా సీట్లతో ఇతరుల సపోర్ట్‌తో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటయ్యిందని, కేంద్రంలో చంద్రబాబు నితీష్‌ కుమార్‌ తోక జాడిస్తే పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలన్నారు. కేటీఆర్‌ ఓట్ల చోరీపై మాట్లా డకుండా యూరియా కొరతపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో 8ఎమ్మెల్యే సీట్లు గెలిచి న బీజేపీ ఎంపీ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచిందని, 36 ఎమ్మెల్యే సీట్లు గెలి చిన బీఆర్‌ఎస్‌ సున్న సీట్లకే ఎలా పరిమితమైందని ప్రశ్నించారు. పది సంవత్సరాలు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండి రాష్ట్రాన్ని విధ్వంసం చేశార ని, కేసీఆర్‌ ఉండగా కేటీఆర్‌, హరీష్‌రావు కవిత ముఖ్యమంత్రి పీఠం కోసం తమలో తమ కొట్టుకుంటున్నారని నేనేమి తక్కువ అన్నట్లు నా లుగో సింహం సంతోష్‌రావు కూడా పోటీ పడుతున్నారన్నారు. తెలం గాణ పదాన్ని పార్టీ నుంచి తొలగించిననాడే తెలంగాణ ప్రజలతో పేగు బంధం తెగిపోయిందన్నారు. రాష్ట్రంలో ఏం చేయలేని కేసీఆర్‌ బీఆర్‌ ఎస్‌ పేరుతో దేశాన్ని దోచుకోవాలని చూశారన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, గ్రంథాలయ సం స్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణ, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, మండ లాల కాంగ్రెస్‌ అధ్యక్షులు, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 12:51 AM