సకాలంలో ఆర్డర్ పూర్తిచేయాలి
ABN , Publish Date - Jun 18 , 2025 | 01:00 AM
వస్త్ర పరిశ్రమ సొసైటీలకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని విని యోగించుకోవాలని, చీరల ఉత్పత్తి ఆర్డర్ సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపా రు.
సిరిసిల్ల, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): వస్త్ర పరిశ్రమ సొసైటీలకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని విని యోగించుకోవాలని, చీరల ఉత్పత్తి ఆర్డర్ సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపా రు. మంగళవారం సమీకృత రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో చీరల ఉత్పత్తి పురోగతిపై చేనేత జౌళి, దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజ రామయ్యార్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాలతో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మ్యాక్స్ సంఘాల సభ్యులు, ఆసాములతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి, కార్మికులను ఆదుకునేందుకు ప్ర భుత్వ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని అన్నారు. నిర్దేశిత గడువులోగా చీరల ఉత్పత్తి ఆర్డర్ పూర్తి చేయాలన్నారు. ఇందిరా మహిళా శక్తి ఆర్డర్ ద్వారా వస్త్ర పరిశ్రమ కార్మికులకు 8నెలల పాటు ఉపాధి లభిస్తుందని, మిగిలిన 4నెలలు కూడా ఉపాధి లభించే విధంగా ఇతర శాఖల నుంచి ఆర్డర్లు ఇప్పిం చేందుకు చర్యలు తీసుకుంటున్నా మని, ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లను సకాలంలో పూర్తి చేసి ప్రభుత్వం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు.
చీరల ఉత్పత్తి వేగవంతం చేయాలి
- చేనేత జౌళి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యార్
నేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళా సంఘాల సభ్యులకు రెండు చీరలు పంపిణీ చేసేందుకు నిర్ణయించిందని చీరల ఉత్పత్తి ప్రక్రియ వేగవంతం చేయాలని చేనేత జౌళి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్య అన్నారు. మొదటి చీర పంపిణీ చేసేందుకు సిరిసిల్లలోని 131 మ్యాక్స్ సొసైటీ పరిధిలోని 16424 వేల పవర్‌లూమ్స్ 4 కోట్ల 30 లక్షల మీటర్ల చీరల ఉత్పత్తి ఆర్డర్ జనవరి, మార్చి నెలలో రెండు దశలలో అందించిందన్నారు. మొదటి దశ 2 కోట్ల 12 లక్షల మీటర్ల చీరలు ఉత్పత్తి ఆర్డర్‌కు ఇప్పటివరకు సిరిసిల్ల చేనేత సొసైటీ నుంచి 50 లక్షల 55 వేల మీటర్ల ఉత్పత్తి పూర్తి చేశామని అన్నారు. ఆగస్టు 15 నుంచి చీరల పంపిణీ చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. 45రోజుల గడువులో 3.5 కోట్ల మీటర్ల చీర ఉత్పత్తి చేయాలని, ప్రతి సొసై టీ పరిధిలో ఉన్న పవర్‌లూమ్స్‌లు పూర్తి స్థాయిలో చీరల ఉత్పత్తి చేయాలని, రోజూ ఉదయం, రాత్రి షిఫ్టు ల్లో పని చేయాలన్నారు. పవర్ లూమ్స్‌లలో కార్మికుల సంఖ్య పెంచాలన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. పాత బకాయిలను దాదాపు పూర్తి స్థాయిలో చెల్లింపులు చేశామని, ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని శాఖల నుంచి బట్ట ఉత్పత్తి ఆర్డర్లు చేనేత సోసైటీలకు వస్తుందని, స్కూల్,అంగన్‌వాడీల యూనిఫామ్ దుస్తు లు ఆర్డర్ అందించామని,రాబోయే రోజుల్లో దేవాదాయ శాఖ నుంచి మరో ఆర్డర్ వస్తుందని అన్నారు. ఇందిరా మహిళా శక్తి కింద ప్రభుత్వం అందించే ఆర్డర్ చాలా పెద్దదని, దాదాపు సంవత్సరానికి 9 కోట్ల మీటర్ల బట్ట ఉత్పత్తి చేయాల్సి ఉంటుందన్నారు. సొసైటీలు చీర ఉత్పత్తి ప్రక్రియ వేగవంతం చేసి సకాలంలో ఆర్డర్ పూర్తి చేయాలన్నారు. ప్రతి సొసైటీకి కేటాయించిన లక్ష్యంలో కనీసం జూన్ నెలాఖరు వరకు 50 శాతం పూర్తి చేయాలని, లేని పక్షంలో సంబంధిత సొసైటీ ఆర్డర్ రద్దు చేసి 50 శాతం పూర్తి చేసిన సొసైటీలకు ఆర్డర్ అందిస్తామన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అవసరమైన ఆర్డర్‌లన్నీ రాష్ట్ర ప్రభుత్వం తరపున అం దిస్తున్నామని తెలిపారు. కార్మికులకు ప్రతివారం రూ 4వేల నుంచి 5వేల వరకు ఆదాయం వస్తుందని తెలి పారు. ప్రభుత్వం నుంచి ఇందిరా మహిళల శక్తి చీరల ఆర్డర్ పొందిన వారు మొదటి చీర ఉత్పత్తిని త్వరగా పూర్తి చేసి అందజేయాలని సూచించారు. రెండో చీర ఆర్డర్‌కు సిద్ధం కావాలన్నారు. ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకొని మరింత అభివృద్ధిలోకి రావా లని ఆకాంక్షించారు.అనంతరం సొసైటీల వారీగా చీర ల ఉత్పత్తి పురోగతిని సమీక్షించి పలు సూచనలు చేసి ఖచ్చితమైన ఆర్డర్ వివరాలను నమోదు చేశారు.