Share News

పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి

ABN , Publish Date - Nov 02 , 2025 | 12:13 AM

ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆశనిపాతంగా ఉన్న కాంట్రీబ్యూటరీ పెన్స న్‌ విధానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని పీఆర్టీయూటీస్‌ జిల్లా అధ్యక్షుడు గన్నమనేని శ్రీనివాస్‌రావు అన్నారు.

పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి

సిరిసిల్ల టౌన్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆశనిపాతంగా ఉన్న కాంట్రీబ్యూటరీ పెన్స న్‌ విధానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని పీఆర్టీయూటీస్‌ జిల్లా అధ్యక్షుడు గన్నమనేని శ్రీనివాస్‌రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్‌ జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ లో పీఆర్టీయూటీఎస్‌ జిల్లా సర్వసభ్య సమావేశం జిల్లా అధ్యక్షుడు గన్నమనేని శ్రీనివాస్‌రావు అధ్యక్షతన జరిగింది. ముందుగా సర్వసభ్య సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎడ్ల కిషన్‌ నివేదికను సమర్పించారు. అనంతరం 13 మండలాల అధ్యక్ష, కార్యదర్శులతో వివిధ అంశాలపై చర్చించి వారి అభి ప్రాయాలను తెలుసుకొని కొన్ని తీర్మానాలను సర్వసభ్య సమావేశంలో ఆమోదించారు. ఈ సందర్భంగా గన్నమనేని శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్‌లో ఉన్నటువంటి ఐదు డీఏ(కరువు భత్యం)లు ప్రభుత్వం మంజూరు చేయాలన్నారు. నూతన పే రివిజన్‌ కమీషన్‌ రిపోర్టును ప్రభుత్వం తెప్పించుకొని 45 శాతం ఫిట్మెంట్‌తో అమలు చేయాల న్నారు. ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీం ఉద్యోగ, ఉపాధ్యాయుల కాంట్రీ బ్యూషన్‌తో అన్ని అసుపత్రులో నగదు రహిత సేవలు పొందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమం, టైం స్కేల్‌ అమలు చేయాలని ఇతర ఉద్యోగుల మాదిరిగా అన్ని రకాల సెలవులు వర్తింపచేయాలని, ఎంప్లాయిస్‌ హెల్త్‌కి హెల్త్‌ స్కీమ్‌ను వర్తింపజేయాలన్నారు. మోడల్‌ స్కూల్లలో పని చేస్తున్న ఉపాధ్యాయు లకు జీరో వన్‌ జీరో హెడ్స్‌ ఆఫ్‌ అకౌంట్‌ కింద పాలసీ ఇవ్వాలన్నారు. పదోన్నతులకు కూడా అవకాశాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం నూత నంగా ఏర్పాటు చేయబోతున్న ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌లలో ప్రస్తుతం పని చేస్తున్న పంచాయితీరాజ్‌ ఉపాధ్యాయులను కూడా తీసుకోవాలన్నారు. సర్వీస్‌లో ఉన్న సీనియర్‌ ఉపాధ్యాయులకు నష్టం జరగకుండా టీఈ టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం చట్టం సవరణ చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాలని కోరారు. ప్రాథమిక విద్యా వ్యవస్థ బలోపేతానికి అన్ని పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేస్తూ ఒక ప్రధానోపాధ్యాయుని పోస్టు అలాగే 60 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలకు తరగతికి ఒక ఉపాధ్యాయుడి చొప్పున పోస్టులను మంజూరు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు నీలి శ్రీనివాస్‌, జిల్లా నాయకులు మాడిశెట్టి మహేష్‌, జక్కని నవీన్‌, కైరి పద్మ, షేక్‌బాబు, గుర్రం దేవదాస్‌, ఎర్ర ప్రవీన్‌, నల్ల పర్శరాం, తేల్ల పూర్ణచందర్‌, అరకాల బాల్‌రెడ్డి, ఆయా మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2025 | 12:13 AM