చేనేత, జౌళి శాఖ కార్యాలయాన్ని మార్చాలి
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:16 AM
కలెక్టరేట్‌కు మార్చిన చేనేత జౌళి శాఖ కార్యాలయాన్ని యాథావిధిగా సిరిసిల్లకు మార్చాలని పవర్‌లూం వర్కర్స్ యూనియన్(సీఐటీయూ)జిల్లా అధ్యక్షుడు కోడం రమణ అన్నారు.
సిరిసిల్ల టౌన్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి) : కలెక్టరేట్‌కు మార్చిన చేనేత జౌళి శాఖ కార్యాలయాన్ని యాథావిధిగా సిరిసిల్లకు మార్చాలని పవర్‌లూం వర్కర్స్ యూనియన్(సీఐటీయూ)జిల్లా అధ్యక్షుడు కోడం రమణ అన్నారు. గురువారం చేనేత జౌళిశాఖ కార్యాలయాన్ని సిరిసిల్లకు మార్చాలని పవర్‌లూం వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) నాయకులు కలెక్టర్, చేనేత జౌళిశాఖ అధికారికి వినతి పత్రంను అందించారు. ఈ సందర్భంగా కోడం రమణ మాట్లాడారు. కార్మిక క్షేత్ర మైన సిరిసిల్ల పట్టణంలో స్థానిక బీవైనగర్‌లో కార్మికులందరికి అందుబాటులో చేనేత జౌళిశాఖ కార్యాలయం ఉండేదన్నారు. కొద్దిరోజుల క్రితం కలెక్టరేట్‌కు తర లించడం వల్ల కార్మికులు దూరప్రాంతంలో ఉన్న కలెక్టరేటుకు రావడానికి ఇబ్బం ది అవుతుందన్నారు. కలెక్టరేట్ నుంచి తిరిగి సిరిసిల్లకు మార్చాలని గతంలో కలెక్టర్, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రస్తుతం కొత్తగా వచ్చిన కలెక్టర్ దృష్టికి మరోసారి సమస్యలను తీసుకెళ్లామని తెలిపారు. త్రిఫ్ట్ పథకానికి సంబంధించిన డబ్బులు కార్మికులకు పూర్తి స్థాయిలో రాలేవని మంత్రి దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. అధికారులు స్పం దించి త్రిఫ్ట్‌కు సంబంధించిన డబ్బులు కార్మికుల ఖాతాలో వెంటనే జమ చేయా లని డిమాండ్ చేశారు. కొత్త త్రిఫ్ట్‌ను వెంటనే ప్రారంభించాలన్నారు. ఇందిరా మహిళా శక్తి చీరలకు సంబంధించి పవర్‌లూం అనుబంధ రంగాల కార్మికులకు పది శాతం యారన్ సబ్సిడీని అందించాలని కార్మికుల పక్షాన కోరామని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో పవర్‌లూం వర్కర్స్ యూనియన్ నాయకులు సిరిసిల్ల సత్యం, గుండు రమేష్, బాస శ్రీధర్, ఉడుత రవి, ఎక్కల్‌దేవి జగదీష్, స్వర్గం శేఖర్, శ్రీనివాస్, పలువురు కార్మికులు పాల్గొన్నారు.