Share News

కొత్త చెరువు ఆవరణ శుభ్రంగా ఉండాలి

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:29 AM

సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు ఆవరణ శుభ్రంగా ఉండాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ ఆదేశించారు.

కొత్త చెరువు ఆవరణ శుభ్రంగా ఉండాలి

సిరిసిల్ల టౌన్‌, నవంబరు 12 (ఆంధ్ర జ్యోతి) : సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు ఆవరణ శుభ్రంగా ఉండాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ ఆదేశించారు. బుధవారం సిరిసిల్ల పట్టణ శివారులోని కొత్త చెరువును ఇంచార్జి కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌ పరిశీలించారు. కొత్త చెరువు కట్టను పరిస రాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. కొత్త చెరువుతో పాటు పరిసరాలను నిత్యం శుభ్రం చేయాలని పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. అందుకు అవసరమైన యంత్రాలు, సామగ్రిపై ప్రతిపాదనలు పంపాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌పాషాను ఆదేశించారు. పట్టణ ప్రజలు పూర్తిగా కొత్త చెరువును వినియోగించుకునేలా సుందరీకరించాలని అన్నారు. అనంతరం రగుడు సమీపంలోని మున్సిపల్‌ డంపింగ్‌ యార్డ్‌ను ఇన్‌చార్జి కలెక్టర్‌ సందర్శించారు. తడిపొడి చెత్తను వేరు చేసే విధానాన్ని, కంపోస్ట్‌ తయారీ విధానాన్ని ఇన్‌చార్జి కలెక్టర్‌ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. డంపింగ్‌ యార్డ్‌కు కావాల్సిన యంత్రాలు, పరికరాలకు ప్రతిపాదనలు పంపాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. అక్కడి నుంచి సిరిసిల్ల పట్టణంలోని రైతు బజారుకు చేరుకొని రైతు బజారును సందర్శించారు. రైతు బజారులోని రైతులు, కూరగాయల వ్యాపారులతో ఇన్‌చార్జి కలెక్టర్‌ మాట్లాడారు. రైతు బజారులో వారి సౌకర్యాలపై ఆరా తీశారు. స్లాటర్‌ హౌస్‌ నిర్మించాలని అధికా రులకు సూచించారు. ఈ సందర్భంగా ఇన్‌ చార్జి కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌ మాట్లాడుతూ రైతు బజార్‌లోనే పూర్తిగా విక్రయాలు జరపాలన్నారు. చికెన్‌, మటన్‌, చేపలు, కూర గాయల విక్రయాలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంట మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ వెల్ముల స్వరూపతిరుపతిరెడ్డి, సిరిసిల్ల ఆర్డీవో వెంక టేశ్వర్లు, డీవీహెచ్‌వో రవీందర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌బేగం, తహ సీల్దార్‌ మహేష్‌కుమార్‌, మున్సిపల్‌ కమి షనర్‌ ఖదీర్‌పాషా, సిబ్బంది, మార్కెట్‌ కమి టీ డైరెక్టర్లు ఉన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 12:29 AM