Share News

సైన్స్‌ వింగ్‌ కళాశాల నూతన భవనం వినియోగంలోకి తేవాలి

ABN , Publish Date - Aug 13 , 2025 | 12:10 AM

కరీంనగర్‌ కార్ఖానగడ్డలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల(సైన్స్‌వింగ్‌)లోని నూతన భవనంలో సౌకర్యాలు కల్పించి, తరగతులు ప్రారంభించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం సైన్స్‌వింగ్‌ కళాశాలను కలెక్టర్‌ సందర్శించారు.

సైన్స్‌ వింగ్‌ కళాశాల నూతన భవనం వినియోగంలోకి తేవాలి

కరీంనగర్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): కరీంనగర్‌ కార్ఖానగడ్డలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల(సైన్స్‌వింగ్‌)లోని నూతన భవనంలో సౌకర్యాలు కల్పించి, తరగతులు ప్రారంభించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం సైన్స్‌వింగ్‌ కళాశాలను కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కళాశాల ప్రాంగణంలో ఉన్న స్ర్కాప్‌ను వెంటనే తొలగించాలని ఆదేశించారు. శిధిలావస్థలో ఉన్న భవనాలను పూర్తిగా తొలగించాలని అన్నారు. కళాశాలలో ఆరు తరగతులతో కూడిన నూతన భవన నిర్మాణం నాలుగేళ్ల క్రితం ఆగిపోయినందున ఈ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. కలెక్టర్‌ వెంట ప్రిన్సిపాల్‌ వెంకటరమణచారి ఉన్నారు.

ఫ స్వచ్ఛ హరిత విద్యాలయ రేటింగ్‌లో అన్ని పాఠశాలలు పాల్గొనాలి

కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ హరిత విద్యాలయ రేటింగ్‌లో జిల్లాలోని అన్ని పాఠశాలలు పాల్గొనాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్‌లో స్వచ్ఛ హరిత విద్యాలయ నమోదు, బుధవారం బోధన, ఇంగ్లీష్‌ క్లబ్‌, తదితర అంశాలపై మండల విద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని పాఠశాలల్లో టాయిలెట్స్‌, తాగునీటి సౌకర్యం, తదితర వివరాలు స్వచ్ఛ హరిత విద్యాలయ యాప్‌లో నమోదు చేయాలన్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కేంద్ర బృందం పరిశీలించి పాఠశాలలకు ర్యాంక్‌ ఇస్తుందని తెలిపారు. సమావేశంలో యూనిసెఫ్‌ జిల్లా సమన్వయకర్త కిషన్‌స్వామి, స్వచ్ఛ భారత్‌ సమన్వయకర్త వేణుప్రసాద్‌, విద్యాశాఖ కో ఆర్డినేటర్‌ అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 12:10 AM