మౌలిక వసతుల కల్పనే ప్రధాన ధ్యేయం
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:36 AM
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పననే తన ప్రధానఽధ్యేయమని, విమర్శించే వ్యక్తులకు అభివృద్ధితోనే సమాధానం చెబుతానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు.
- విమర్శలు చేసేవారికి అభివృద్ధి తోనే సమాధానం
- జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్
జగిత్యాలరూరల్/జగిత్యాల అర్బన్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో మౌలిక వసతుల కల్పననే తన ప్రధానఽధ్యేయమని, విమర్శించే వ్యక్తులకు అభివృద్ధితోనే సమాధానం చెబుతానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల రూరల్ మండలంలోని తక్కళ్లపల్లి, గుల్లపేట గ్రామాల్లో రూ. 22 లక్షల 20 వేలతో నిర్మించనున్న సీసీరోడ్డు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. జగిత్యాల పట్టణంలోని చింతకుంట శ్మశాన వాటికలో 15వ ఫైనాన్స్ నిధులు 40 లక్షల రూపాయలతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్ మర్మమతులు, 10 లక్షల సాధారణ నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూ అనంతారం బ్రిడ్జి నిర్మాణం విషయంలో కేంద్రప్రభుత్వంతోపాటు, ఎంపీ ధర్మపురి అర్వింద్ దృష్టికి తీసుకెళ్లానని త్వరలోనే బ్రిడ్జి నిర్మాణానికి కృషిచేస్తానని తెలిపారు. తక్కళ్లపల్లి గ్రామంలో బస్‌స్టాప్ నిర్మాణం కోసం కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ గోలి శ్రీనివాస్, బాలె వంకర్, సమిండ్ల శ్రీనివాస్, కప్పల శ్రీకాంత్, పంబాల రాము, ఆరుముల్ల పవన్, కల్లెడ ప్యాక్స్ చైర్మన్ సందీప్‌రావు, సీనియర్ నాయకులు నక్కల రవీందర్‌రెడ్డి, దమ్మని బాలముకుందం, మాజీ జడ్పీటీసీ ఎల్లారెడ్డి, ములాసపు మహేష్, చిర్ర నరేష్, దమ్మ రాజిరెడ్డి, దమ్మ సురేందర్‌రెడ్డి, గడ్డం నారాయణరెడ్డి, జక్కుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
- చెక్కు అందజేత
జగిత్యాల పట్టణంలోని కౌసర్ మసీద్‌కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మూడు లక్షల 20 వేల చెక్కును శుక్రవారం అందజేశారు. పట్టణంలోని నాలుగో వార్డులో ఉన్న కౌసర్ మసీద్ అభివృద్ధికి నిదులు మంజూరు కాగా పనులు పూర్తి కావడంతో దానికి సంబందించిన చెక్కును ఎమ్మెల్యే మసీదు బాధ్యులకు అందజేశారు. కార్యక్రమంలో క్యాదాసు నవీన్, కుసరి అనిల్, ఖాదర్ ముజాయిద్, చెట్‌పల్లి సుధాకర్, గాదె కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.