Share News

సంబురంగా సద్దుల బతుకమ్మ

ABN , Publish Date - Oct 01 , 2025 | 12:21 AM

ధర్మపురి క్షేత్రంలో సద్దుల బతుక మ్మ వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు వివిధ రకాల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలపై గౌరీ దేవిని ప్రతిష్ఠించారు. తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట, గోదావరి నదీ తీరాన గల స్నానఘట్టాల సమీపంలో గల పోచమ్మ మైదానంలో బతుక మ్మ ఆటలు ఆడారు.

సంబురంగా సద్దుల బతుకమ్మ

ధర్మపురి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ధర్మపురి క్షేత్రంలో సద్దుల బతుక మ్మ వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు వివిధ రకాల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలపై గౌరీ దేవిని ప్రతిష్ఠించారు. తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట, గోదావరి నదీ తీరాన గల స్నానఘట్టాల సమీపంలో గల పోచమ్మ మైదానంలో బతుక మ్మ ఆటలు ఆడారు. అనంతరం బతుకమ్మలను గోదావరి నదిలో నిమజ్జ నం చేశారు. అనంతరం మహిళలు, యువతులు పరస్పరం వాయినాలు ఇప్పి పుచ్చుకు న్నారు. బతుకమ్మ నిమజ్జనానికి మున్సిపాలిటీ తరపున కమిషనర్‌ మామిళ్ల శ్రీనివాస్‌రావు, మేనేజర్‌ బాలె గంగాధర్‌, శాని టరీ ఇన్స్‌ పెక్టర్‌ చిట్యాల గంగాధర్‌ ఏర్పాట్లు చేశారు. ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్‌ఐలు ఉదయ్‌కుమార్‌, రవీందర్‌కుమార్‌ ఆధ్వర్యంలో బందో బస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ సంగి సత్యమ్మ, మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్లు సంగనభట్ల సంతోషి, వేముల నాగలక్ష్మి, జక్కు పద్మ, గరిగె అరుణ, లక్ష్మీ నరసింహఫ్రెండ్స్‌ గ్రూపు కన్వీనర్‌ అక్కెనపెల్లి జయలక్ష్మి, వనిత క్లబ్‌ అధ్యక్షురాలు మత్యపు రాధిక, శారదా మహిళా మండలి అధ్యక్షురాలు మధ్వాచారి విజయలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2025 | 12:21 AM