Share News

ఉపాధిహామీ చట్టాన్ని నీరుగార్చేందుకే జీ రామ్‌ జీ బిల్లు

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:27 AM

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకే పార్లమెంట్‌లో జీ రామ్‌ జీ బిల్లు ప్రవేశపెట్టిందని సీపీ ఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్‌ అన్నారు.

ఉపాధిహామీ చట్టాన్ని నీరుగార్చేందుకే జీ రామ్‌ జీ బిల్లు

సిరిసిల్ల రూరల్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకే పార్లమెంట్‌లో జీ రామ్‌ జీ బిల్లు ప్రవేశపెట్టిందని సీపీ ఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్‌ అన్నారు. వ్యవసా య కార్మికులు, నిరుపేద కూలీలకు తీవ్రంగా నషాన్ని కలిగించే ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసం హరించుకోవాలని డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల పట్టణం లోని అంబేద్కర్‌ చౌరస్తాలో శనివారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాయకులు జీ రామ్‌ జీ ఉపాధిహా మీ బిల్లుకు సంబంధించిన ప్రతులను దహనం చేసి ని రసన తెలిపారు.ఈసందర్భంగా జిల్లాకార్యదర్శి మూషం రమేష్‌ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజే పీ ప్రభుత్వం అంగబలంతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని రద్దు చేసి ఆ స్థానంలో జీ రామ్‌ జీ పేరుతో బిల్లును తీసుకవచ్చిందన్నారు. ఇది దేశంలోని వ్యవసాయ కార్మికులకు, పేద రైతులు, కూలీలకు తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. కోట్లాదిమంది గ్రామీణ వ్యవసాయ కార్మికులు ఇతర పేదలకు భరోసా గా ఉన్న 100 రోజులు పని కల్పించే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం రద్దు చేయాలని ఆలోచన బీజేపీ ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ వచ్చిందన్నారు. మహాత్మా గాంధీని అవమానపరిచే ఈ ఆలోచన తుదిరూపమే జీ రామ్‌ జీ బిల్లు ద్వారా ఇచ్చిందన్నారు.జీ రామ్‌ జీ బిల్లు ద్వారా గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా మార్పులు చేశారని విమర్శించారు. రానున్నకాలంలో గ్రామీణ పేదలు పనిని హక్కు గా పొందే అవకాశం ఉండద న్నారు. తక్షణమే కేంద్ర ప్రభు త్వం తీసుకొచ్చిన జీ రామ్‌ జీ ఉపాధి బిల్లును ఉపసంహరించుకొని పాత గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేశా రు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యు లు కోడం రమణ, జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, శ్రీరాముల రమేష్‌ చంద్ర, సీపీఎం సీనియర్‌ నాయకులు మిట్టపల్లి రాజమల్లు, నాయకులు నక్క దేవదాస్‌, ఏలి గేటి శ్రీనివాస్‌, బింగి సంపత్‌, స్వర్గం శేఖర్‌, సూరం వీరే శం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 12:27 AM