Share News

ఓట్ల లెక్కింపును పరిశీలించిన ఇన్‌చార్జి కలెక్టర్‌

ABN , Publish Date - Dec 15 , 2025 | 12:36 AM

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు పూర్తైన పోలీంగ్‌ కేంద్రాల నుంచి తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి ఆదివారం చేరుకుంది.

ఓట్ల లెక్కింపును పరిశీలించిన ఇన్‌చార్జి కలెక్టర్‌

తంగళ్లపల్లి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు పూర్తైన పోలీంగ్‌ కేంద్రాల నుంచి తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి ఆదివారం చేరుకుంది. తంగళ్లపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రిసెప్షన్‌ కేంద్రానికి సామాగ్రి, అధికారులు, సిబ్బంది చేరుకోగా.. ఈ సందర్బంగా ఇంచార్జీ కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్‌, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌తో కలిసి పరి శీలించారు. ఎన్నికల సిబ్బంది, అధికారులతో ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై మాట్లడారు. అలాగే సారంపల్లి పోలింగ్‌ కేంద్రం లోని ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీసీవో శ్రీనివాసాచారి, తహసీల్దార్‌ జయంత్‌, ఎంపీడీవో లక్ష్మీనారా యణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 15 , 2025 | 12:37 AM