Share News

శాలువాలను డ్రెస్సులుగా మార్చాలనే ఆలోచన గొప్పది

ABN , Publish Date - Sep 29 , 2025 | 12:36 AM

ప్రజాప్రతినిధులుగా ప్రజలు గౌరవంతో తీసకువచ్చే శాలువలను డ్రెస్సులుగా కుట్టి చిన్నారులకు ఉచితంగా పంపిణీ చేయాలనే ఆలోచన రావడం గొప్పవిషయని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

శాలువాలను డ్రెస్సులుగా మార్చాలనే ఆలోచన గొప్పది

వేములవాడ టౌన్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రజాప్రతినిధులుగా ప్రజలు గౌరవంతో తీసకువచ్చే శాలువలను డ్రెస్సులుగా కుట్టి చిన్నారులకు ఉచితంగా పంపిణీ చేయాలనే ఆలోచన రావడం గొప్పవిషయని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. తన కోసం తీసుకువచ్చిన శాలువాలను పోగుచేసి వాటిని అందమైన డిజైన్‌లో కుట్టించి వాటిని చిన్నారులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు ఆలోచన చేసిన తన తనయుడు ఆది కార్తీక్‌ను ఆది శ్రీనివాస్‌ అభినందించారు. ఈ సందర్భంగా వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని నాంపల్లి ఆరవ వార్డు శౌరాలకాలనీ, పార్వతిపురం కాలనీల్లోని చిన్నారులకు దసరా కానుకగా దుస్తులను ఆదివారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో నీలం గురువయ్య, కాశ శ్రీనివాస్‌, చిలివేరి శ్రీనివాస్‌, సల్మాన్‌రెడ్డి, జడల రవీందర్‌, శంకర్‌, అక్కనపల్లి నరేష్‌, పర్శరాములు కాంగ్రెస్‌ నాయకులు తదితరులు ఉన్నారు. తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 29 , 2025 | 12:36 AM