Share News

తీరిన ఇసుక కష్టాలు

ABN , Publish Date - May 16 , 2025 | 12:36 AM

జిల్లాలో ఇసుక కష్టాలు తీరాయి.

తీరిన ఇసుక కష్టాలు

కోల్‌సిటీ, మే 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇసుక కష్టాలు తీరాయి. గతంలో స్యాండ్‌ ట్యాక్స్‌ బుకింగ్‌ చేస్తే రూ.3500ల నుంచి 4 వేల వరకు ఖర్చయ్యేది. వరుస క్రమంలో సరఫరా చేయడంతో అవసరమైన సమయంలో ఇసుక లభించేది కాదు. ఎమ్మెల్యేల చొరవతో ప్రస్తుతం ట్రాక్టర్‌ లోడుకు రూ.1000 నుంచి రూ.1300 వరకు ఇసుక లభిస్తోంది. దీంతో నిర్మాణదారులకు ఊరట లభించింది.

రామగుండం అర్బన్‌లో గతంలో స్యాండ్‌ ట్యాక్సీతో పాటు ముర్మూర్‌ ఇసుక క్వారీ నుంచి అక్రమంగా ఇసుక తరలించేవారు. నిర్మాణదారులు, కాంట్రాక్టర్లు చెన్నూరు గోదావరి, మానేరు క్వారీల నుంచి ఇసుక తెప్పించుకునే వారు. ఇసుకకు డిమాండ్‌ భారీగా ఉండ డంతో రామగుండం, ఇందారం తదితర ప్రాంతాల నుంచి అక్రమంగా రవాణా జరిగేది. ఈ అక్రమ రవా ణాలో లక్షల రూపాయలు చేతులు మారడంతో విని యోగదారులపై భారం పడేది. ఈ విషయంలో ట్రాక్టర్ల యాజమానుల మధ్య గొడవలతో రవాణా సైతం నిలి చిపోయింది. కొన్ని సందర్భాల్లో ఇసుక అందుబాటులో లేక నిర్మాణాలు నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇసుక మాఫియా కనుసన్నల్లోనే అధికార యంత్రాంగం పని చేసే పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు అధికారులు సైతం ఏసీబీకి పట్టుబడ్డారు. మరికొందరిపై క్రమశిక్షణ వేటు పడింది.

ఎమ్మెల్యే చొరవతో తగ్గిన ధర

జిల్లాలో ఇసుక ధరలను నియంత్రించేందుకు ఎమ్మె ల్యేలు చొరవ చూపారు. రామగుండంలో గోదావరి ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు. రామగుండం అవసరాలకు మాత్రమే గోదావరి నుంచి ఇసుక తీసు కునేలా చర్యలు చేపట్టారు. గోదావరిఖని, ఎన్‌టీపీసీ, జనగామ ప్రాంత ట్రాక్టర్ల యజమానులు గోదావరి నుంచి ఇసుకను తీసుకువచ్చి అర్బన్‌ ఏరియాలో రవా ణా చేస్తున్నారు. రామగుండం పట్టణంలో లింగాపూర్‌, రామగుండం ప్రాంత ట్రాక్టర్లు, గోదావరిఖనిలో పట్టణ పరిధివారు, ఎన్‌టీపీసీ, ఎఫ్‌సీఐ ఏరియాల్లో ఎన్‌టీపీసీ ప్రాంత ట్రాక్టర్‌ యజమానులు ఇసుక రావాణా చేస్తు న్నారు. గంగానగర్‌, పవర్‌హౌస్‌కాలనీ, సప్తగిరికాలనీ ప్రాంతాల్లో రూ.1000 నుంచి రూ.1100 ట్రిప్పు పోస్తు న్నారు. దూరాన్ని బట్టి పట్టణంలోని ఇతర ప్రాంతాల్లో రూ.1200 నుంచి రూ.1300లకు సరఫరా చేస్తున్నారు. నిర్మాణదారులు వర్షాకాలంలో సైతం ఇబ్బందులు కలు గకుండా ఇండ్ల వద్ద ఇసుక నిల్వ చేసుకుంటున్నారు. ట్రాక్టర్ల యజమానులే గిరాకీల కోసం నిర్మాణదారుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇసుక రేటు తగ్గడంతో దీని ప్రభావం మట్టిపై పడింది. మట్టి కూడా రూ.1000 నుంచి రూ.1400వరకు ట్రిప్పు లభి స్తోంది. నిర్మాణదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎలిగేడు (ఆంధ్రజ్యోతి): ఇసుక ధర తగ్గడంతో సామాన్య ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. సుల్తానాబాద్‌ మండలం లోని గర్రెపల్లి, నీరుకుళ్ల, గట్టెపల్లి, కదంబాపూర్‌ ప్రాం తాల్లోని మానేరు వాగు నుంచి ఎలిగేడు, జూలపల్లి తోపాటు ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. గతంలో ఆన్‌లైన్‌ పద్ధతి ద్వారా ట్రాక్టర్‌ రూ.2000 వరకు నిర్ణయించి వరుస క్రమంలో ఇసుకను అందిం చేవారు. ఇసుక ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండడం వల్ల ప్రజల అవసరాలను ఆసరాగా చేసు కున్న ఇసుక వ్యాపారులు అధిక ధరలతో విక్రయిం చేవారు.

ఇంటి నిర్మాణంలో ఇసుక భారం కాకూడదని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమ యంలో ఎన్నికల ముందు ఇసుక, మట్టిని అమ్ము కుంటూ పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టగానే అధి కారులతో పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించి ఇసుక ధర తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తు తం ట్రాక్టర్‌ ఇసుకకు వెయ్యి రూపాయలకు లభిస్తుం డడంతో నిర్మాణదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక భవనం నిర్మాణానికి 20నుంచి 30ట్రిప్పుల ఇసుక అవసరం పడుతుండగా ఇప్పుడు ధర ప్రకారం లబ్ధిదా రులకు గతంతో పోలిస్తే రూ.50వేల వరకు మిగులు తున్నాయి. ఇసుక ధరలు తగ్గడంతో గ్రామాల్లో నిర్మాణాలు పెరగడంతో కార్మికులకు ఉపాధి అవకాశా లు మెరుగుపడ్డాయి.

పెరుగుతున్న వలస కార్మికులు

గ్రామాల్లో పనులు లేక ఇబ్బంది పడుతున్న తాపీ మేస్త్రీలు కూలీలకు వలస వచ్చిన కార్మికుల వల్ల పోటీ పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర నుంచి వచ్చిన కార్మికులు పనిచేస్తున్నారు. నిర్మాణ పనులపైన ఆధారపడి జీవిస్తున్న తమకు ఉపాధి లభించడం లేదని స్థానికులు ఆందోళన చేస్తున్నారు. స్థానిక కార్మికులకు పనులు లభించేలా అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని ఈప్రాంత కార్మికులు కోరుతున్నారు.

మంథని, (ఆంధ్రజ్యోతి): గోదావరి, మానేరు నదుల నుంచి స్థానిక అవసరాల కోసం ప్రజలు ఉచి తంగా ఇసుకను తీసుకోవడానికి కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. మంథని డివిజన్‌లోని ప్రజలకు రవాణా వ్యయంతో ఇసుక చౌకగా లభిస్తుంది. ప్రజల అవస రాలకు ఫ్రీగా ఇసుక తీసుకునే అవకాశం కల్పించాలని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు కలెక్టర్‌కు సూచించడంతో ఆదేశాలు జారీ చేశారు. ఈ అవకాశం డివిజన్‌లోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌ పూర్‌ మండలాల ప్రజలకు ఏర్పడింది. గతంలో మానేరు సూపర్‌ ఫైన్‌ ఇసుక ట్రాక్టర్‌కు రూ.3500 నుంచి 4 వేల వరకు, గోదావరి నది ఇసుకకు రూ.2 వేల నుంచి 2500 వరకు ధర పలికింది. ఇసుక ధరలు అధికంగా ఉండటంతో నిర్మాణాలు చేపట్టే వారికి ఆర్థికంగా భారం పడుతుండేది. అధికారులు తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వానికి సాండ్‌ ట్యాక్స్‌ చెల్లించేది లేక పోవడంతో ధరలు అంటుబాటులోకి వచ్చాయి. గోదావరి నది నుంచి రూ. 1200 నుంచి 1500 వరకు, మానేరు నది నుంచి రూ. 2 వేల వరకు ట్రాక్టర్‌కు యాజమానులు తీసుకుంటున్నారు.

Updated Date - May 16 , 2025 | 12:36 AM