గొప్ప మానవతావాది పండిట్ దీన్‌దయాల్
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:37 PM
అంత్యోదయ సిద్ధాంతకర్త గొప్ప మానవతా వాది పండిట్ దీన్‌దయాల్ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
భగత్‌నగర్, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతిత): అంత్యోదయ సిద్ధాంతకర్త గొప్ప మానవతా వాది పండిట్ దీన్‌దయాల్ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అన్నం లేకుండా ఎవరు అలమటించ వద్దని అంత్యోదయ సిద్ధాంతాన్ని తీసుకు వచ్చిన మహానీయుడన్నారు. సేవే లక్ష్యంగా రాజకీయాలు కొనసాగించాలని చెప్పిన గొప్ప వ్యక్తి అన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్‌రావు, బాస సత్యనారాయణరావు, గుగ్గిళ్లపు రమేష్, వాసాల రమేష్, పాల్గొన్నారు.
ఫ నగరంలోని రేకుర్తి 18వ డివిజన్‌లో బీజేపీ పశ్చిమ జోన్ కన్వినర్ జాడి బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పండిట్ దీన్‌దయాల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నాంపల్లి శంకర్, ఎం లక్ష్మీరాజం, లాలమురళి, అస్తపురం విక్రమ్, సంజీవరెడ్డి, రావుల భాస్కరాచారి,రాజేష్, పోచయ్య పాల్గొన్నారు.
ఫ పండిట్ దీన్‌దయాల్ జయంతి సందర్భంగా విద్యానగర్‌లో బీజేపీ నాయకులు శక్తి కేంద్రం ఇన్‌చార్జి నరహరి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రమేష్‌చంద్ర, బండ రాకేష్, చంద్రగిరి వేణు, మొగిలి లక్ష్మణ్, పోతు జగదీష్, కచ్చు మధు, బొంగుని పరుశురాం, భగత్ పాల్గొన్నారు.