భూసమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Apr 26 , 2025 | 12:38 AM
భూమస్యలు పరిష్కరించ డమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు.
ముస్తాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి) : భూమస్యలు పరిష్కరించ డమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. ముస్తాబాద్‌లోని రైతు వేదికలో నిర్వహించిన భూభారతి, ఆర్‌వోఆర్ చట్టంపై జరిగిన అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా కలెక్టర్ సందీ ప్ కుమార్ ఝా పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కంచడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వం రుపొందిచిన భూభారతి, ఆర్‌వోఆర్ చట్టాలపై పలు అంశాలను వివ రించారు. చట్టాలు అమల్లోకి వచ్చాయని, ముందుగా రాష్ట్రంలోని 4 మండలాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారని వివరించారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామం లో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం ధరణిలో ఉన్న రికార్డులు భూ భారతి చట్టంలో కొనసాగుతాయన్నారు. భూ హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అర్హులైన వారు జిల్లాలో నూతన చట్టం అమల్లోకి వచ్చిన ఎడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆ దరఖాస్తులను ఆర్డీవో, కలెక్టర్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారన్నారు. దరఖాస్తుదా రునికి అభ్యంతరాలుంటే కలెక్టర్ భూమి ట్రిబ్యునల్‌లో అప్పీల్ చేసుకో వచ్చన్నారు. భూసమస్యలు, హద్దుల సమస్యలు రాకూడదనే ఉద్దశ్యం తో రాష్ట్ర ప్రభుత్వం ఈ నూతన చట్టంలో జియో ట్యాగింగ్‌తో అలాగే మ్యాప్‌తో పాసుపుస్తకాలను జారీ చేయనుందని వెల్లడించారు. దీంతో రైతులకు దారి సమస్య ఇతర ఇబ్బందులు ఎదరుకావన్నారు. అన్ని అర్హతలు ఉండి భూసమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి భూ భారతి చట్టం ఉపయోగపడుతుందన్నారు. ఆర్డీవో రాధాబాయి, మార్కె ట్ కమిటీ చైర్‌పర్సన్ రాణినర్సింలు, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, తహసీల్దా ర్ సురేశ్, మాజీ జడ్పీటిసి సభ్యుడు యాదగిరిగౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆంజనేయరావు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
మండలంలోని కొండాపూర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పరిశీలించా రు. ఎప్పటికప్పుడు ధాన్యం తూకం వేయాలని, తరలించడానికి సరిప డా వాహనాలున్నాయని పేర్కొన్నారు. తహసీల్దార్ సురేశ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, ఐకేపీ నిర్వాహకులున్నారు.