Share News

మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:47 AM

ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు.

మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

వేములవాడ, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ పట్టణంలోని 24, 25, 26, 27 వార్డులలో సీసీ రోడ్లు, సైడ్‌ డ్రెయి న్‌, అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ ఆది శ్రీని వాస్‌ మాట్లాడుతూ గత పది సంవత్సరాల ప్రభుత్వం హయాం లో పడవు పడ్డా పనులను పూర్తిచేస్తున్నామన్నారు. వివిధ వార్డు లలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించుకుంటూ, రేవం త్‌రెడ్డి నాయత్వంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముం దుకు పోతున్నామన్నారు. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్‌ కార్డులు మంజూరు చేశామని తెలిపారు. పేదల కు దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సన్నం బియ్యం పంపిణీ పథకా న్ని ప్రారంభించామన్నారు. గతంలో రైతులకు రుణమాఫీ చేసిన విధం గా నేతన్నలకు రుణమాఫీ చేశామని తెలిపారు. చేనేత కార్మికులు తీసుకున్న రుణాలు మాఫీ చేశామని, వేములవాడ పట్టణం చేనేతకు ఒక క్లస్టర్‌గా ఉందన్నారు. నేతన్నలు సుదీర్ఘకాలంగా ఎదురుచూసిన యారన్‌ డిపో మంజూరు చేశామన్నారు. 90 శాతం సబ్సిడీపై యారన్‌ పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. నేతన్నలకు అండగా ఉంటామ న్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి సమాంతరంగా చేస్తుంద న్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి, రోడ్ల వెడల్పు చేస్తున్నామన్నారు. మూలవాగులో గుడి చెరువులో మురుగు నీరు కలవకుండా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రజలు అందించే సూచనలు సలహాలు తీసుకొని ముందుకు పోతామన్నారు. గతంలో ముఖ్యమంత్రి, 8 మంది మంత్రుల సమక్షంలో 1000 కోట్లతో వేములవాడ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. రాబోవు రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కార్‌కు అండగా నిలవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రెండి రాజు, మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్‌ గౌడ్‌, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 12:47 AM