మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - May 05 , 2025 | 12:20 AM
ప్రజలకు మెరుగైన కనీస సౌకర్యాలు, వైసద్యం అందించడమే ప్రభు త్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ టౌన్, మే 4 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరుగైన కనీస సౌకర్యాలు, వైసద్యం అందించడమే ప్రభు త్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణ పరిధిలోని శాత్రాజుపల్లి గ్రామంలో రూ. 1.43 కోట్టతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి ఆదివారం కలెక్టర్ సందీప్‌కుమార్‌తో కలిసి ఆయన శుంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ శాత్రాజు పల్లి గ్రామం చైతన్యవంతమైందని అన్నారు. ఎంతో మం ది ప్రభుత్వ ఉద్యోగులను అందించిన చరిత్ర గ్రామానికి ఉందని గుర్తు చేశారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేసుకుంటుపోతున్నామని స్పష్టం చేశా రు. గ్రామంలో 30 పడకల ఆసుపత్రి నిర్మిస్తే చుట్టపక్కల గ్రామాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ఈ ప్రాంతం వైద్యానికి హబ్‌గా ఏర్పడుతుందని అన్నారు. ఎవరు అడగకున్నా ఆసుపత్రి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. సైడ్‌డ్రైన్ నిర్మాణానికి రూ. 12 లక్షల నిధులు మంజూరు చేశామని తెలిపారు. అనంతరం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మా ట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో హెల్త్ సెంటర్ ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపా రు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికా రులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, సింగిల్వీండో చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి, సంఘ స్వామి, సంద్రగిరి శ్రీనివాస్ తదిత రులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.