Share News

మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Nov 26 , 2025 | 12:45 AM

ఇందిరా మహిళా శక్తి ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మ హిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగు తున్నారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం

సిరిసిల్ల, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఇందిరా మహిళా శక్తి ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మ హిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగు తున్నారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని 8871 ఎస్‌హెచ్‌జీలకు రూ 8.12 కోట్ల రుణాల చెక్కులను ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్లాల ని కోరారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో ఎస్‌హెచ్‌జీలకు వడ్డీ రుణాలు పంపిణీ చేశామని తెలిపారు. జిల్లాలోని స్వయం సహాయక మహిళా సంఘాలు దాదాపు రూ 8.12 కోట్లు లబ్ధి దారుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ అయ్యాయని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం మొదటి విడతలో 7802 ఎస్‌హెచ్‌జీలకు రూ 7.40 కోట్లు, రెండో విడతలో 8552 ఎస్‌హెచ్‌జీలకు రూ 11.78 కోట్లు వడ్డీలేని రుణాలు పంపిణీ చేసిందన్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇప్పటి వరకు రూ 100.10 కోట్లు ఆర్ధిక సహాయం ప్రభు త్వం అందించిందన్నారు. ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడు తూ మహిళలు ఆర్థికంగా వృద్ధి చెంది ఉన్నత స్థానాలకు ఎదగాలన్నా రు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ నాగుల సత్యనారా యణ గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్లు స్వరూపారెడ్డి, విజయ, సాబేరబేగం, రాణి, చైర్మన్‌ రాములునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 26 , 2025 | 12:45 AM