Share News

పేదల ఆత్మగౌరవం నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:41 AM

పేదల ఆత్మగౌరవం నిలబెట్టడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు.

పేదల ఆత్మగౌరవం నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యం
చెక్కపల్లిలో లబ్ధిదారుతో మాటాడుతున్న విప్‌ ఆది శ్రీనివాస్‌

- ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌

వేములవాడ కల్చరల్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): పేదల ఆత్మగౌరవం నిలబెట్టడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. చెక్కపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఆదివారం ఆయన స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదింటి సొంతింటి కల నెలరవేర్చుతున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఇప్పటికే బేస్‌మెంట్‌ పూర్తి చేసుకున్నాయన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క డబుల్‌ బెడ్‌రూం ఇంటిని కూడా పూర్తి చేయలేదన్నారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణపనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చెర్మన్‌ రొండి రాజు, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం, నాయకులు అడ్డిక జైపాల్‌రెడ్డి, బొడ్ల రాములు, సోయినేని కరుణాకర్‌, రోమాల ప్రశాంత్‌, సోమినేని బాలు పాల్గొన్నారు.

మాట ఇచ్చి... నిలబెట్టుకుని..

వేములవాడ టౌన్‌: ఓ నిరుపేద మహిళ తనకు రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు లేదని వారం రోజుల క్రితం ఆది శ్రీనివాస్‌కు మొర పెట్టుకుంది. వారం రోజుల్లో రేషన్‌కార్డు, ఆధార్‌కార్డులు ఇప్పించి తమ ఇంటికి వస్తానని మాట ఇచ్చిన ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ తన మాటను నిలబెట్టుకున్నారు. వేములవాడ పట్టణానికి చెందిన పల్లపు శారధ 17వ వార్డులో ఓ పూరి గుడిసేలో నివాసం ఉంటుంది. రేషన్‌కార్డు ఇప్పించిన విప్‌ శారధ ఇంటికి వెళ్లడంతో పూరిగుడిసే ఉండటంతో వెంటనే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇప్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంది రమ్మ ఇళ్లు తప్పకుండా మంజూరు చేస్తానని సదరు మహిళకు హామీచ్చారు.

Updated Date - Aug 11 , 2025 | 12:41 AM