Share News

పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Nov 16 , 2025 | 12:31 AM

నిరుపేద ప్రజల సొంతింటి కల తీర్చాలనే లక్ష్యంతో ప్రభు త్వం పనిచేస్తుందని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.

పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం

ఇల్లంతకుంట,నవంబరు 15(ఆంధ్రజ్యోతి): నిరుపేద ప్రజల సొంతింటి కల తీర్చాలనే లక్ష్యంతో ప్రభు త్వం పనిచేస్తుందని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో శనివారం డబుల్‌బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులకు ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ కలిసి ప్రొసీడింగ్‌ పత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల వద్ద వసతులు లేకపోవడం వల్ల పంపిణీ ఆలస్యం జరిగిందన్నారు. అర్హులైన వారందరికి ఇల్లు మంజూరు చేస్తామన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పిల్లర్‌ రూఫింగ్‌తో ఖర్చు తగ్గుతుందన్నారు. ఈవిధానం అనుసరించడం వల్ల ఇంటిలో ఉష్ణోగ్రత కొంత తగ్గుతుందన్నారు. మండలకేంద్రంలోని మోడల్‌ ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అనంతారం, సిరికొండ గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశాలల్లో పాల్గొని లబ్దిదారులను అభినందించారు. కార్యక్రమంలో గృహనిర్మాణశాఖ డీఈ ఖాజాముజాఫర్‌, తహసీల్దార్‌ ఫారూఖ్‌, ఎంపీడీఓ శశికళ, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు రమణారెడ్డి, అయిలయ్య, నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి, నాయకులు తీగల పుష్పలత, చిట్టి ఆనందరెడ్డి, ఐరెడ్డి మహేందర్‌రెడ్డి, మామిడి రాజు, రమేష్‌, మామిడి సంజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2025 | 12:31 AM