Share News

అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం

ABN , Publish Date - Nov 23 , 2025 | 11:53 PM

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం

వేములవాడ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ పట్టణంలోని నాంపల్లి ఇస్లాంన గర్‌లో ఆదివారం సుమారు 200మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పి ప్రభుత్వ విప్‌ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వం లో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటూ అనేక పథకాలను అమలుచేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 200యూనిట్లకు ఉచిత విద్యుత్‌,ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు, నూతన రేషన్‌ కార్డుల మంజూరు చేస్తున్నామన్నారు. ఉచిత బస్సు సౌకర్యం ద్వారా సుమారు ఇప్పటి వరకు రూ.200కోట్లు ఉచిత ప్రయా ణాలు పూర్తిచేసుకున్నట్లు వివరిం చారు. కాంగ్రెస్‌ పార్టీ లౌకిక పార్టీ అని అన్ని వర్గాల వారికి భరోసా కల్పిస్తుందన్నారు. ప్రభుత్వం అందజేసే పథకాలు ప్రజలకు చేరవేసేలా కార్యకర్తలు చూడాలని సూచించారు. త్వరలోనే ఇస్లాంన గర్‌లో కల్యాణ మండప నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీచ్చారు. డ్రైనేజీ సీసీ రోడ్డు నిర్మాణం చేప డుతామని తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమంలో బొజ్జ భారతి, నీలం గురువయ్య, కాశ శ్రీనివాస్‌, రాగరి నాగరాజు, అలీబి, బీరెడ్డి సల్మాన్‌ రెడ్డి, అల్లం ఆరోగ్యమ్మ, తుమ్మ ప్రశాంత్‌రెడ్డి, చిలివేరి శ్రీనివాస్‌, జ్యోతి, పోచవేని నాగరాజు, శ్రీనివాస్‌ ఉన్నారు.

Updated Date - Nov 23 , 2025 | 11:53 PM