Share News

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - May 11 , 2025 | 12:31 AM

గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు.

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

బోయినపల్లి, మే 10 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండలంలోని గుండన్నపల్లిలో రూ.8లక్షలతో సీసీ రోడ్డు, స్తంబంపల్లి గ్రామంలో ఎండోమెంట్‌ ఆధ్వర్యంలో నిర్మించనున్న సుగ్రీవ ఆలయానికి శనివారం భూమిపూజ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకరావాలన్నారు. ప్రతివాడ కు సీసీ రోడ్డు నిర్మించాలనే లక్ష్యంతో రూ3.10కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కొండపోచమ్మ ఆలయానికి రహదారి, మోడల్‌ స్కూల్‌కు రోడ్డు సౌకర్యం, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద 1.60కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎమ్‌సీ చైర్మన్‌ బోయిని ఎల్లేష్‌యాదవ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు భీంరెడ్డి మహేశ్వర్‌రెడ్డి, సెస్‌డైరెక్టర్‌ కొట్టపల్లి సుధాకర్‌, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు కౌడగాని వెంకటేష్‌, నాయకులు అక్కనపల్లి ఉపేందర్‌, ఉయ్యాల శ్రీనివాస్‌గౌడ్‌, సంబ లక్ష్మీరాజం, ఏనుగుల కనుకయ్య, మహమ్మద్‌, నగేష్‌, రాజేష్‌, ప్రవీణ్‌, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2025 | 12:31 AM