మహిళల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం..
ABN , Publish Date - Nov 23 , 2025 | 12:07 AM
మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో శనివారం ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్‌తో కలిసి ఇందిరా మహిళాశక్తి చీరలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రతి పథకం అమలులో మహిళలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోదన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ చైర్‌పర్సన్ ఐరెడ్డి చైతన్యమహేందర్‌రెడ్డి, డీఆర్డీఓ శేషాద్రి, ఏఎమ్‌సీ వైస్‌చైర్మన్ ప్రసాద్, మండల ప్రత్యేకాధికారి రామకృష్ణ, తహసీల్దార్ ఫారూఖ్, ఎంపీడీవో శశికళ, ఏపీఎం లతామంగేశ్వరి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డిలతో పాటు అధికారులు, మహిళలు పాల్గొన్నారు.