Share News

అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:58 AM

అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం

బోయినపల్లి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మండలంలో బుధవారం జరిగిన వివిధ కార్యక్రమంలో మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. సంద ర్భంగా మిడ్‌ మానేరు జలాశయంలో స్థానిక నాయకులతో చేపపిల్లలను వదిలా రు. అనంతరం స్వచ్ఛ భారత్‌ స్కీమ్‌ భాగంగా నీలోజీపల్లిలో నూతనంగా నిర్మిం చిన కమ్యూనిటీ టాయిలెట్స్‌ను ప్రారంభించారు. బోయినపల్లిలోని అంగన్‌వాడీ చిన్నారులకు దుస్తుల పంపిణీ చేసి రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌, షాదీముబారక్‌ చెక్కులను, అలాగే రైతుబీమా చెక్కు లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజాపాలనలో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన పథకాలను కొన సాగిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భా గంగా ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నామన్నారు. అనంతరం ఇందిరాగాంధీ జ యంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్‌ ఫిషరీస్‌ ఆఫీసర్‌ సౌజన్య, తహసీల్దార్‌ నారాయణరెడ్డి, ఎం పీడీవో జయశీల, స్వచ్ఛభారత్‌ కోఆర్డినేటర్‌ సురేష్‌, ఎంపీవో శ్రీధర్‌, ఏఎంసీ చైర్మ న్‌ బోయిని ఎల్లేష్‌ యాదవ్‌, సెస్‌డైరెక్టర్‌ కొట్టేపల్లి సుధాకర్‌, ఉమ్మడి జిల్లా మాజీ డీసీఎంఎస్‌ ముదుగంటి సురేందర్‌రెడ్డి, బీజీ సెల్‌అధ్యక్షుడు కూస రవిందర్‌, నాయకులు వన్నెల రమణారెడ్డి, నాగుల వంశీ, నవీన్‌ యాదవ్‌లు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 12:58 AM