Share News

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Oct 27 , 2025 | 12:17 AM

రైతుల సంక్షమ మే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రొండి రాజు అన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

వేములవాడ టౌన్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షమ మే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రొండి రాజు అన్నారు. వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘం ఆధ్వర్యంలో పట్టణంలోని బాల్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలేత్తిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేం ద్రాల్లో ఎవరైన అవినీతి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో సీఈవో మిట్ట లక్ష్మణ్‌ డైరేక్టర్‌లు ఖమ్మం గణేష్‌, కత్తి కనుకయ్య, సంఘస్వామి యాదవ్‌, పుల్కం రాజు, అం బాటి చంద్రశేఖర్‌, పులి రాంబాబు, నాగుల విష్ణు ఉన్నారు.

Updated Date - Oct 27 , 2025 | 12:17 AM