Share News

బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN , Publish Date - Aug 31 , 2025 | 12:58 AM

భారీవర్షాలకు పంటలు దెబ్బ తిన్నాయని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బాధిత రైతులను ఆదుకోవాలని బీ జేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్‌ చేశారు.

బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

గంభీరావుపేట, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): భారీవర్షాలకు పంటలు దెబ్బ తిన్నాయని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బాధిత రైతులను ఆదుకోవాలని బీ జేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్‌ చేశారు. గంభీరావుపేట మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను శనివారం గోపి పరి శీలించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా పంట పొలాలను వరదలు ముంచెత్తాయని, పంటలు నీట మునగడంతో పాటు ఇసుక మేటలు వేశాయన్నారు. పంట పొలాలను పరిశీలిస్తే తిరిగి సేద్యంకు పనికి రాకుండా అయ్యాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి పంట నష్టాలను అంచన వేసి, బాధిత రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాం డ్‌ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కోడె రమేష్‌, మాజీ అద్యక్షుడు గంట అశోక్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు మల్లేశ్‌యాదవ్‌, విగ్నేష్‌గౌడ్‌, జిల్లా అధికార ప్రతినిధి దెవసాని కృష్ణ, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వాజీద్‌, నాయ కులు రాజేందర్‌రెడ్డి, రాజుగౌడ్‌, నాగరాజుగౌడ్‌, సత్యనారాయణ, చంద్రం యాదవ్‌, బాలరాజు, ఎల్లం, అనిల్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 31 , 2025 | 12:59 AM