Share News

తుఫాన్‌ వల్ల నష్టపోయిన పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN , Publish Date - Nov 06 , 2025 | 12:05 AM

మొంథా తుపాన్‌ ప్రభావంతో పంట నష్టపోయిన పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా ఆదుకోవాలని పత్తి రైతుల సంఘం రాష్ట్ర కో కన్వీనర్‌ చెల్పూరి రాము డిమాండ్‌ చేశారు.

తుఫాన్‌  వల్ల నష్టపోయిన పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
సైదాపూర్‌ మండలం సోమారం గ్రామ శివారులో తుఫాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న పత్తి పంటను పరిశీలిస్తున్న చెల్పూరి రాము

సైదాపూర్‌, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): మొంథా తుపాన్‌ ప్రభావంతో పంట నష్టపోయిన పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా ఆదుకోవాలని పత్తి రైతుల సంఘం రాష్ట్ర కో కన్వీనర్‌ చెల్పూరి రాము డిమాండ్‌ చేశారు. సైదాపూర్‌ మండలంలోని గర్రెపల్లి, సోమారం, ఎక్లాస్‌పూర్‌ గ్రామాల్లో వర్షం ప్రభావంతో దెబ్బతిన్న పత్తి పంటలను ఆయన రైతు సంఘం నాయకులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి పత్తిపంట సాగు చేస్తే చేతికి వచ్చే సమయంలో తుఫాన్‌ వచ్చి రైతులు నష్ట పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్ట పోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే ఎకరాకు 50 వేల రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అధికారులు వెంటనే పంట నష్టంపై సర్వే నిర్వహించాలన్నారు. పత్తికి మద్దతు ధర పెంచాలన్నారు. కార్యక్రమంలో పత్తి రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యలు గుండేటి వాసుదేవ్‌, రైతులు ఎండీ హుస్సేన్‌ , ఓదెలు, మల్లయ్య, సతీష్‌, భూమయ్య పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2025 | 12:05 AM