జీపీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి
ABN , Publish Date - Oct 13 , 2025 | 12:49 AM
గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంతో పాటు విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన కార్మికులు కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ డిమాండ్ చేశారు.
సిరిసిల్ల రూరల్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి) : గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంతో పాటు విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన కార్మికులు కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గంభీరావుపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో పనిచేస్తున్న రమేష్ అనే కార్మికుడు చెరువులో ఉన్న బావిలో నీటిపంపునకు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులోనే పడి చనిపోవడాన్ని నిరసిస్తూ గ్రామపంచాయతీ కార్మికులతో కలిసి సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మూషం రమేష్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లేక్కలేనట్లుగా వ్యవహరిస్తోందన్నారు. గంభీరావుపేట చెరువులోని బావి దగ్గరకు వెళ్లడానికి వీలులేకుండా కూడా ఉండడంతోపాటు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసి కూడా రమేష్‌ను అధికారులు బలవంతంగా ఆ బావిలో పని చేయాలని పంపించడంతోనే రమేష్ చనిపోయాడని, దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు భద్రతను కల్పించి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, కనీస వేతనాలు అమలుచేయాలన్నారు. చనిపో యిన రమేష్ కుటుంబానికి రూ 10లక్షల ఆర్థిక సహాయం అందించి ఆ కుటుం బంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమాన్ని చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మల్యాల నర్సయ్య, ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు వర్కోలు మల్లయ్య, తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు బూర శ్రీనివాస్, గంభీరావుపేట మండల అధ్యక్షుడు అంజనేయులు, ముస్తాబాద్ మండల అధ్య క్షుడు శ్రీనివాస్, వేములవాడ రూరల్ మండల అధ్యక్షుడు మహేష్, చీర్లవంచ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.