Share News

ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయాలి

ABN , Publish Date - Sep 12 , 2025 | 12:21 AM

ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం కలెక్టరేట్‌ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో బీడీ కార్మికులు, మహిళలు, నాయకులు ధర్నా చేప ట్టారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయాలి

సిరిసిల్ల టౌన్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం కలెక్టరేట్‌ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో బీడీ కార్మికులు, మహిళలు, నాయకులు ధర్నా చేప ట్టారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలోని అధికారులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టీ స్కైలాబ్‌బాబు, జిల్లా కార్య దర్శి మూషం రమేష్‌ మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ప్రధానమైన రూ.4వేల పెన్షన్‌ అమలుచే యాలని, బీడీ కార్మికులకు విధిస్తున్న కోతలను అరిక ట్టాలని, వేయి బీడీలకు రూ.800 వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అర్హులైన నిరుపేదలం దరికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాల న్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి, మల్లారపు అరుణ్‌, కోడం రమ ణ, జవ్వాజీ విమల, గన్నేరం నర్సయ్య, సూరం పద్మ, గురజాల శ్రీధర్‌, మల్లారపు ప్రశాంత్‌, అన్నల్‌దాస్‌ గణేష్‌, శ్రీరాముల రమేష్‌, ముక్తికాంత్‌ అశోక్‌, ఎరవె ల్లి నాగరాజు, బీడీ కార్మికులు, మహిళలు పాల్గొన్నా రు. నిర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను అర్హులైన పేదలకు పంపిణీ చేయాలన్నారు.

Updated Date - Sep 12 , 2025 | 12:21 AM