అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:53 AM
ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
చందుర్తి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మండలం మూడపల్లి గ్రామంలో కమ్యూనిటీ భవన నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిటీ భవనాలు పలు సమస్యల పరి ష్కారానికి వేదికలుగా నిలుస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగా ప్రభుత్వం తరఫున కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తు న్నట్లు తెలిపారు. మూడపల్లి గ్రామంతో తనకు 1995 నుంచి అనుబంధం ఉంద న్నారు. మూడపల్లి గ్రామంలో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరి గిందని, ఇప్పటికే టెండర్లు పూర్తి అయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయన్నారు. మూడపల్లి-హన్మజిపేట, ఎనగల్ గ్రామాల మధ్య రోడ్డు నిర్మా ణం కోసం ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదు పాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపంటి రామస్వామి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు నాగం కుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం, కాంగ్రెస్ నాయకులు ముస్కు ముకుందరెడ్డి, బాణాల రవీందర్‌రెడ్డి, పుల్కం లచ్చయ్య, పుల్కం మోహన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.