బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది
ABN , Publish Date - Sep 11 , 2025 | 12:52 AM
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే ప్రధాన రోడ్డు విస్తరణలో భాగంగా కొంత మందికి నష్టం జరిగిందని, అలాంటి వారిని ప్రభుత్వం తప్పకుం డా ఆదుకుంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు.
వేములవాడ టౌన్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే ప్రధాన రోడ్డు విస్తరణలో భాగంగా కొంత మందికి నష్టం జరిగిందని, అలాంటి వారిని ప్రభుత్వం తప్పకుం డా ఆదుకుంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. వేములవాడ పట్టణంలోని కుల సంఘాలకు మంజూరైన ప్రొసీడింగ్ ప్రతాలను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయలేని పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒకరిద్దరికి నష్టం వాటిళ్ళుతుందని, దీంతో వేలాది మందికి లబ్దిచేకూరుతుందని అన్నారు. నష్టం వాటిళ్లిన నిర్వసితుల త్యాగం ఎప్పటికి మర్వలేనిదని, ప్రభుత్వం ఆదుకునేలా ముందుకు సాగుతున్నామని వివరించారు. ఇటీవలే రూ. 6 కోట్లతో 80 ఫీట్ల రోడ్డు విస్తరణకు శంకుస్థాపన చేశామని, మూడు మాసాల్లో రోడ్డు నిర్మాణం పూర్తి అవుతుందని అన్నారు. అభివృద్ది కళ్ళ ముందు కనిపిస్తున్న కొందరు అప్పుడప్పుడు వచ్చి ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదని అన్నారు. వీ కంటికి మాత్రం అభివృద్ది ఎందుకు కనిపిస్తలేదని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో వేములవాడ పట్టణంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో నిలిపేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయని వివరిం చారు. ఈ కార్యక్రమంలో రొండి రాజు, కనికరపు రాకేష్, సంద్రగిరి శ్రీనివాస్, పులి రాంబాబు, చిలుక రమేష్ తదితరులు ఉన్నారు.