Share News

బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేయాలి

ABN , Publish Date - Apr 18 , 2025 | 12:37 AM

ఎన్నికలు ఏవైనా జిల్లాలో బీజేపీ జెండా ఎగరవేయడ మే లక్ష్యంగా సమష్టి కృషితో పనిచేయాలని నిజామా బాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, జాతీయ పసుపుబోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి కార్యకర్త లకు పిలుపునిచ్చారు.

బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేయాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే దన్‌పాల్‌ సూర్యనారాయణ, పక్కన పసుపబోర్డు చైర్మన్‌ గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు

- నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి

- పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం

జగిత్యాల అగ్రికల్చర్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలు ఏవైనా జిల్లాలో బీజేపీ జెండా ఎగరవేయడ మే లక్ష్యంగా సమష్టి కృషితో పనిచేయాలని నిజామా బాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, జాతీయ పసుపుబోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి కార్యకర్త లకు పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ధరూర్‌ క్యాంప్‌లో జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాచకొండ యాదగిరి బాబు జిల్లా అధ్యక్షుడిగా భాధ్యతలు స్వీకరించారు. అనంతరం ముఖ్యఅతిథిగా హాజరైన సూర్యనారాయణ మాట్లాడుతూ బీజేపీ అంటేనే కార్యకర్తల పార్టీ అన్నారు. దేశంకోసం, ధర్మకోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని గుర్తుచేసిన ఆయన కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను, ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యిందని, ప్రభుత్వ వైఫల్యాలలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లి ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

అనంతరం జాతీయ పసుపుబోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ చిట్టచివరి వ్యక్తి వరకు పార్టీని తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించాలన్నారు. తాజీ మాజీ అధ్యక్షుడు సత్యనారాయణ పార్టీ బలోపే తం కోసం తీవ్రంగా కృషిచేశారని, నూతన జిల్లా అధ్యక్షుడు యాదగిరి కార్యకర్తల కష్టసుఖాల్లో భాగం పంచుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల విజయానికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ, పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో బీజే పీ జిల్లా తాజామాజీ అధ్యక్షుడు సత్యనారాయణరావు, రాష్ట్ర కార్యవ ర్గ సభ్యురాలు బోగ శ్రావణి, ధర్మపురి, కోరుట్ల నాయకులు కన్నం అంజయ్య, డాక్టర్‌ రఘు, పట్టణ బీజేపీ అధ్యక్ష, కార్యదర్శులు కొక్కు గంగా ధర్‌, రాజన్న, ఆముద రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిల్ల సత్యనారాయణ, రాష్ట్ర, జిల్లా బాధ్యులు నలువా ల తిరుపతి, జుంబర్తి దివాకర్‌, సాంబారి కళావతి, గడ్డ ల లక్ష్మీ హరికృష్ణ, మమత, కవిత, పుష్పారెడ్డి, నాయకు లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2025 | 12:37 AM