Share News

సైబర్‌ నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి

ABN , Publish Date - Sep 19 , 2025 | 12:30 AM

సైబర్‌ నేరాల నియంత్రణే లక్ష్యంగా వారియర్‌లు పనిచేయాలని ఎస్పీ మహేష్‌ బి. గీతే అన్నారు.

సైబర్‌ నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి

సిరిసిల్ల క్రైం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : సైబర్‌ నేరాల నియంత్రణే లక్ష్యంగా వారియర్‌లు పనిచేయాలని ఎస్పీ మహేష్‌ బి. గీతే అన్నారు. గురువారం సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, మోసపూరిత ఆన్‌లైన్‌ కార్యకలాపాలను అరికట్టడం, తక్షణ చర్యల ద్వారా బాధితులకు న్యాయం చేయడం వంటి అంశాల్లో కృషి చేసిన సైబర్‌ సెల్‌ ఆర్‌ఎస్‌ఐ జునైద్‌, డిస్ట్రిక్ట్‌ సైబర్‌ క్రైం ఎస్‌ఐ శ్రీకాంత్‌, వేములవాడ రూరల్‌ కానిస్టేబుల్‌ రాజశేఖర, సిరిసిల్ల టౌన్‌ కానిస్టేబుల్‌ వెంకటరమణలకు ఎస్పీ ప్రశంసా పత్రాలు, ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సైబర్‌ క్రైం దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం అత్యంత కీలకమన్నారు. భవిష్యత్తులో మరింత నైపుణ్యంతో కేసులు పరిష్క రించేలా సైబర్‌ వారియర్‌లను ప్రోత్సహిస్తున్నామన్నారు. సైబర్‌ నేరాలకు గురైన్‌ బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి పోలీస్‌ స్టేషన్‌ లో నియమింపబడ్డ సైబర్‌ వారియర్స్‌ సైబర్‌ నేరాలపై వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి కేసులు చేయాలన్నారు. సైబర్‌ నేరగాళ్ల ద్వారా మోసపో యిన వ్యక్తులు డబ్బు బ్యాంకులో ఫ్రిజ్‌ అయి ఉన్నట్లయితే వీలైనంత త్వర గా డబ్బులు తిరిగి వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. అనుకోని రీతిలో ఎవరైనా సైబర్‌ నేరానికి గురైతే కంగారు పడకుండా వెంటనే 1930 ఫోన్‌ నంబర్‌కు, ఎన్‌సీఆర్‌పీ పొర్టల్‌ గానీ దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సైబర్‌ వారియర్‌ని సంప్రదించాలని పేర్కొన్నారు.

Updated Date - Sep 19 , 2025 | 12:30 AM