Share News

అన్ని వర్గాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - May 03 , 2025 | 11:40 PM

ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల అభివృద్దే లక్ష్యంగా ముందుకు పోతున్నామని ప్రభుత్వ విప్‌ వేములవాడ శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్‌ అన్నారు.

అన్ని వర్గాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

వేములవాడ రూరల్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల అభివృద్దే లక్ష్యంగా ముందుకు పోతున్నామని ప్రభుత్వ విప్‌ వేములవాడ శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్‌ అన్నారు. జయవరం గ్రామానికి చెందిన పలు పార్టీల నాయకులు శనివారం దాదాపు 50 మంది ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరగా కం డువా కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీతోనే బడుగు బలహీన వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ పార్టీలో చేరికలు జరుగుతున్నాయాన్నారు. రాష్ట్రంలో కులగణన జరిపి ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచారన్నారు. రైతులు పండించిన ధాన్యన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఎంతో వేగంగా ధాన్యం కొనుగులు చేస్తున్నా మన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. నిన్నటి వరకు 75వేల 484మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. అయినప్పటికీ ఇతర పార్టీల నాయకులు రోడ్డుపైకెక్కి నిరసనలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్‌, సంఘ స్వామి పలువురు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2025 | 11:40 PM