నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:30 AM
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తున్నామని, విద్యార్థులు తమ తల్లిదండ్రుల కలలను సాకారం చేస్తూ ఉన్నత లక్ష్యా లను చేరుకోవాలని ఆకాంక్షించారు.
వేములవాడ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తున్నామని, విద్యార్థులు తమ తల్లిదండ్రుల కలలను సాకారం చేస్తూ ఉన్నత లక్ష్యా లను చేరుకోవాలని ఆకాంక్షించారు. వేములవాడ పట్ట ణంలోని మహాత్మ జ్యోతిబాపూలే గర్ల్స్ రెసిడెన్సీలో మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల హక్కుల గురించి, విద్యా ప్రాముఖ్యత, బాల్య వివాహా లపై అవగహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహిం చిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆడపిల్లలను కచ్చితంగా చదివించాలన్నారు. చదువుకునే దశలో ఎవరిని కూడా పనులకు పంపించవద్దని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి సహాయసహకారాలు అందించ డానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని, విద్యార్థులకు అధి కారులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని తెలి పారు. రెసిడెన్సియల్ విద్యార్థులు చదువుకునే పేద పిల్లల కోసం ప్రజా ప్రభుత్వం 40శాతం డైట్ చార్జీలు, 20 శాతం కాస్మోటిక్ చార్జీలు పెంచామని అన్నారు. పేద పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని లక్ష్యంతో కామన్ డైట్ మేన్యూ ప్రవేశపెట్టామని తెలి పారు. నూతనంగా 11 వేల టీచర్ పోస్టులను డీఎస్పీ ద్వారా భర్తీచేసి ప్రభుత్వపాఠశాలలో నియమించామని అన్నారు. ఉపాధ్యాయులకు సం బంధించిన బదిలీలు పదోన్నతు లు పారదర్శకంగా చేశామని తెలిపారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసకుని వస్తున్నామని, ఐటీఐ కళాశాలను రతన్ టాటా కంపెనీతో అనుసం ధానం చేసుకుని అడ్వాన్స్ ట్రేడ్ సెంటర్లుగా మారుస్తున్నామని వి వరించారు. రూ.200కోట్లు ఖర్చు చేసి 20నుంచి 25ఎకరాల స్థలం లో యంగ్ ఇండియా సమీకృత గురుకుల నిర్మాణ పనులు ప్రభు త్వం చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కె ట్ కమిటీ చైర్మన్ రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, జిల్లా విద్యాధికారి వినోద్‌కుమార్, ఎసీడీపీవో సుచరిత, కేజీబీవీ కోఆర్డినేటర్ పద్మజ, సూపర్‌వైజర్ శంకరమ్మ తదితరులు ఉన్నారు.