పేదలకు ఉచిత వైద్యం అందించడమే లక్ష్యం
ABN , Publish Date - Jun 07 , 2025 | 01:00 AM
పేద ప్రజలకు ఉచిత వైద్యం అందజేయడం ప్రజా ప్రభుత్వం లక్ష్యం అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
రుద్రంగి, జూన్ 6 (ఆంధ్రజ్యోతి) : పేద ప్రజలకు ఉచిత వైద్యం అందజేయడం ప్రజా ప్రభుత్వం లక్ష్యం అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలో కోటి 43 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న 30పడకల ఆసుపత్రి పనులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాల ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనుందని అన్నారు. వైద్యసేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, అందుకోసం ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్, అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ప్రజా ప్రభుత్వం ముం దుకు పోతోందన్నారు. ఆనాడు రాజశేఖర్‌రెడ్డి పేద ప్రజలకు ఉచిత వైద్యం అందజేయాలని ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలుచేస్తే, ప్రజా ప్రభు త్వంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచారన్నారు. వైద్యపరంగా పేదలకు మెరుగైన వసతులు కల్పించడం లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రుద్రంగి మండల కేంద్రానికి రూ.42 కోట్లతో ఏటీసీ సెంటర్, రూ.200 కోట్లతో వేములవాడ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేశా మని, పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రుద్రంగి మండలకేంద్రంలో ఆసుపత్రి నిర్మా ణం పూర్తయితే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగక రంగా ఉంటుందని, 10 సంవత్సరాలుగా ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డులను మంజూరుచేశా మన్నారు. ఈప్రాంతంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించు కుంటూ ముందుకు పోతున్నామన్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎల్‌వోసీల ద్వారా సుమారు 20 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. వేముల వాడ నియోకవర్గంతో పాటు రుద్రంగి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చేలుకలు తిరుపతి, మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్‌రెడ్డి, ఎర్రం గంగ నరసయ్య, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, గండి నారాయణ, కేశిరెడ్డి నర్సారెడ్డి, మాడిశెట్టి అభిలాష్, తర్రె లింగం, కొమిరె శంకర్, పల్లి గంగాధర్, ఎర్రం రాజలిం గం, స్వర్గం పరంధాములు, పిడుగు లచ్చిరెడ్డి, దయ్యాల శ్రీనివాస్, గండి అశోక్, తదితరులు పాల్గొన్నారు.