మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం
ABN , Publish Date - Nov 26 , 2025 | 12:05 AM
మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండల కేంద్రంలో నియోజకవరానికి చెందిన 4,916 స్వశక్తి సంఘాలకు 4.76 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాల చెక్కులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అందజేశారు.
గంగాధర, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండల కేంద్రంలో నియోజకవరానికి చెందిన 4,916 స్వశక్తి సంఘాలకు 4.76 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాల చెక్కులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు వడ్డీలేని రుణాలను సద్వినియోగం చే సుకుని వ్యాపార వేత్తలుగా ఎదగాలన్నారు. అనంతరం నారాయణపూర్ నిర్వాసితులకు పరిహార చెక్కులను అందజేశారు. నారాయణపూర్ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం అందజేస్తామన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల కాలంలో నిర్వాసితులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రజిత, ఎంపీడీవో రాము, మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్‌రెడ్డి, కురిక్యాల సింగిల్ విండో అధ్యక్షుడు తిరుమల్‌రావు, ఏఎంసీ వైస్‌చైర్మన్ తోట కరుణాకర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మనోహర్ పాల్గొన్నారు.