సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యం
ABN , Publish Date - Jul 02 , 2025 | 12:37 AM
సైబర్ నేరాల నియం త్రణే లక్ష్యమని ఎస్పీ మహేశ్ బి. గీతే అన్నారు.
సిరిసిల్ల క్రైం, జూలై 1 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరాల నియం త్రణే లక్ష్యమని ఎస్పీ మహేశ్ బి. గీతే అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో సైబర్ వారియర్స్‌తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. సైబర్ నేరాలు, సైబ ర్ నేరానికి గురైతే ఎలా స్పందించాలనే అంశాలపై ప్రజల్లో అవ గాహన కల్పించాలన్నారు. ప్రతి సైబర్ వారియర్స్‌గా పనిచేయా లన్నారు. సైబర్ నేరాలపై వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందిం చి కేసులు నమోదు చేయాలన్నారు. బ్యాంకులో ఫ్రీజ్ కాబడి నగదు బాధితులకు అందేలా కృషిచేయాలన్నారు. సైబర్ నేరాల పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సైబర్ నేరాలకు గురై న బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్‌లో సైబర్ వారియర్స్ నియమింపబడ్డారన్నారు. అనుకోని రీతిలో సైబర్ నేరానికి గురైతే కంగారుపడకుండా వెంటనే 1930 ఫోన్ నంబర్‌కు, ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌కు, దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో ఉన్న సైబర్ వారియర్‌ను స్పందించాలన్నారు. ఇందుకు ప్రతి పోలీస్ స్టేషన్‌లో సైబర్ వారియర్స్ కోసం ప్రత్యేకంగా ఒక ఫోన్‌నంబర్ అందు బాటులో ఉంటుందన్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సైబర్ వారియర్స్‌కి అనుమానిత లింక్స్ విశ్లేషించడం, అలాగే సోషల్ మీడియా, ఆన్‌లైన్ ఆర్థిక మోసాలపై ధర్యాప్తు చేయడం వంటివాటిపై శిక్షణ ఇచ్చామన్నా రు. సైబర్ నేరగాళ్ల వలలో విద్యావంతులే అధికంగా మోసపోతుండ డం బాధాకరమని మల్టీ లెవల్ మార్కెటింగ్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్, ఇతర ఆన్‌లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. పోలీస్ శాఖ నుంచి ఎలాంటి వాట్సాప్ వీడియో కాల్స్ చేయరని, డిజిటల్ అరెస్ట్‌లని కాల్స్ వస్తే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో వెంటనే సమాచా రం ఇవ్వాలన్నారు. ప్రజల బలహీనతలే సైబర్ నేరస్థుల బలంగా మా రిందన్నారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండటానికి అప్రమ త్తతతే ప్రధాన ఆయుధమన్నారు. ఈ సమావేశంలో జిల్లా సైబర్ సెల్ ఆర్‌ఎస్‌ఐ జునైద్, సైబర్ సెల్ సిబ్బంది, అన్ని పోలీస్‌స్టేషన్‌ల సైబర్ వారియర్స్ పాల్గొన్నారు.