Share News

డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యం

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:15 AM

డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిం చడమే అందరి లక్ష్యమని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు.

డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యం

సిరిసిల్ల క్రైం, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిం చడమే అందరి లక్ష్యమని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. గురువా రం యాంటీ డ్రగ్‌ డే సందర్భంగా మత్తు పదార్థాల వారోత్సవాలలో భాగం గా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా నుంచి గాంధీచౌక్‌ మీదుగా పద్మనాయక కల్యాణ మండపం వరకు ప్లకార్డ్స్‌తో కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, ఎస్పీ మహేశ్‌ బి. గీతే, విద్యార్థినీ, విద్యార్థులు, పోలీసు అఽధికారులు, సిబ్బందితో కలిసి భారీగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, యువత డ్రగ్స్‌ దూరంగా ఉండి ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. డ్రగ్స్‌, గంజాయిని నిర్మూలించేందుకు బాధ్యత గల పౌరులుగా వ్యవహారించి యువత భాగస్వామ్యం కావాల న్నారు. ఎస్పీ మహేశ్‌ బి. గీతే మాట్లాడుతూ విద్యార్థులు, యువత తమ పరిసరాలు, విద్యాలయాలు, ఇతర చోట్ల ఎక్కడైనా డ్రగ్స్‌ వినియోగించినా, విక్రయించినా, తరలించినా సమాచారం ఇవ్వాలన్నారు. డ్రగ్స్‌రహిత సమా జంతో రాష్ట్రంలాగే దేశం ఉన్నతంగా ఉంటుందన్నారు. విద్యార్థులు, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ యాంటీ డ్రగ్స్‌ సోల్జర్‌గా మారాలన్నారు. జిల్లా లోని యాంటీ డ్రగ్స్‌ డే సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, ఇతర పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, పతకాలను కలె క్టర్‌, ఎస్పీల చేతుల మీదుగా అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా అధికారులు, విద్యార్థులు అందరూ కలిసి డ్రగ్స్‌ నిర్మూలన అందరి బాధ్యత అంటూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం వివిధ పోలీస్‌ స్టేషన్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్‌లో విద్యార్థులు గీసిన చిత్రలు, తయారుచేసిన పెయిం టింగ్‌ను చూసి అభినందించారు. ఈ సందర్భంగా ప్లెక్సీలపై యాంటీ డ్రగ్‌ సోల్జర్‌గా కలెక్టర్‌, ఎస్పీ, ఇతర అధికారులు, విద్యార్థులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో వేముల వాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, అదనపు ఎస్పీ చంద్ర య్య, జిల్లా సంక్షేమశాఖ అధికారి లక్ష్మీరాజం, సీఐలు కృష్ణ, మొగిలి, శ్రీని వాస్‌, వీరప్రసాద్‌, నటేశ్‌, నాగేశ్వర్‌రావు, ఆర్‌ఐలు రమేశ్‌, మధుకర్‌, యాదగిరి, ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2025 | 12:15 AM