Share News

విత్తన స్వయం సమృద్ధే లక్ష్యంగా..

ABN , Publish Date - Jun 05 , 2025 | 12:55 AM

ప్రతీ గ్రామంలో రానున్న రెండు, మూడేళ్లలో విత్తన స్వయం సమృద్ధి సాధించడంతోపాటు విత్తన భద్రతలో రాష్ట్రాన్ని దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆద ర్శంగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.

విత్తన స్వయం సమృద్ధే లక్ష్యంగా..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ప్రతీ గ్రామంలో రానున్న రెండు, మూడేళ్లలో విత్తన స్వయం సమృద్ధి సాధించడంతోపాటు విత్తన భద్రతలో రాష్ట్రాన్ని దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆద ర్శంగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ‘నాణ్యమైన విత్తనం- రైతన్నకు నేస్తం’ విత్తుకొద్ది పంట అనే కార్యక్రమానికి రాష్ట్ర అవతరణ దినోత్సవం సంద ర్భంగా శ్రీకారం చుట్టింది. పంటల సాగులో నాణ్యమైన విత్తనం పాత్రను గుర్తించిన జయశంకర్‌ వ్యవసాయ వర్శిటీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ పథకాన్ని సోమవారం కలెక్టరేట్‌ ఆవరణలో జరిగిన రాష్ట్ర అవ తరణ వేడుకల సందర్భంగా తొమ్మిది మంది ఆదర్శ రైతులకు వరి, పెసర విత్తనాల సంచులను రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణా రావు, రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌లతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం రెండు రోజులుగా వ్యవసాయ శాఖ ఆఽధ్వర్యంలో ఏర్పాటు చేసిన 8 బృందాలు మండ లంలోని రైతువేదికల ద్వారా వరి, పెసర విత్తనాలను పంపిణీ చేశారు.

కాల్వశ్రీరాంపూర్‌ మండలంలోని కూనారం వ్యవ సాయ పరిశోధన స్థానంలో రూపొందించిన కేఎన్‌ఎం 7715, కేఎన్‌ఎం 1638, కేఎన్‌ఎం 12510 సన్న రకం వరి విత్తనాలు, ఎంజీ 295 రకం పెసర విత్తనాలను పంపిణీ చేశారు. ఒక్కో రెవెన్యూ గ్రామానికి ముగ్గురు ఆదర్శ రైతులను ఎంపిక చేశారు. 428 మంది రైతు లకు వరి విత్తనాలు, 214 మంది రైతులకు పెసర విత్తనాల సంచులను పంపిణీ చేశారు. ఈ విత్తనాలతో 214 ఎకరాల్లో వరి, 107 ఎకరాల్లో పెసర పంటను సాగు చేయనున్నారు. 10 కిలోల సంచులు వరి విత్త నాలు, 3 కిలోల సంచుల పెసర విత్తనాలను రైతులకు అందజేశారు. ఈ విత్తనాలు అర ఎకరానికి వస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

ఫ పంటల సాగుపై పర్యవేక్షణ

రైతులకు అందించిన నాణ్యమైన విత్తనాలతో చేసే పంటల సాగును శాస్త్రవేత్తలతోపాటు వ్యవసాయ శాఖాధికారులు పర్యవేక్షించనున్నారు. విత్తనం విత్తిన దగ్గర నుంచి మొదలు పంట కోసే వరకు పంటలను పరిశీలించనున్నారు. సాగులో మెళకువలతోపాటు సస్య రక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతులను అనుసరిం చడం, చీడపీడలు వస్తే తీసుకోవాల్సిన చర్యలు, నీటి యాజమాన్యం అంశాలపై రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. పండించిన పం టను బయట మార్కెట్‌లో గానీ, ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి వీలు లేదు. ఆ పంటను విత్తనంగా అదే గ్రామంలో ఉన్న ఇతర రైతులకు తక్కువ ధరకు విక్రయించాల్సి ఉం టుంది. పంట చేతికి వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖాధికారులు గ్రామాల్లో ఉండే రైతులందరినీ ఒక చోట సమావేశ పరిచి వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో అభివృద్ధి చేసిన విత్తనాలు నాణ్యమైనవని, తద్వారా మంచి దిగబడులు వస్తాయని, తక్కువ ధరకే విత్త నాలు లభిస్తాయని, చీడ పీడలు తట్టుకునే విధానాలు, తదితర అంశాల గురించి రైతులకు వివరించి ఆ విత్తనాలతోనే పంటలు సాగు చేయనున్నారు. ఇలా ఒకరి నుంచి మరొకరికి ఈ విత్తనాలను రొటేషన్‌ చేయడం వల్ల రెండు, మూడేళ్లలో మొత్తం విస్తరించ నున్నాయని, తమ భూమిలో తామే స్వయంగా పండిం చిన విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఫ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి

- దోమ ఆదిరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి,

‘నాణ్యమైన విత్తనం- రైతన్నకు నేస్తం’ విత్తుకొద్ది పంట కార్యక్రమం ద్వారా వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో రూపొందించిన మేలైన విత్తనాలను ప్రభు త్వం పంపిణీ చేసింది. ఈ విత్తనాలను ఆదర్శ రైతులు సద్వినియోగం చేసుకోవాలి. తద్వారా వచ్చే పంటను ఇతర రైతులకు తక్కువ ధరకే విక్రయించాలి. దీంతో ప్రతీ గ్రామంలో రైతుకు నకిలీ విత్తనాల బెడద తప్ప నున్నది. రైతులు ఆ విత్తనాలతోనే సాగు చేయడం వల్ల రైతుల చెంతనే నాణ్యమైన విత్తనాలు అందు బాటులో ఉంటాయనే ఉద్ధేశ్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Updated Date - Jun 05 , 2025 | 12:55 AM