ఊరూరా కొలువుదీరిన గణనాథులు
ABN , Publish Date - Aug 29 , 2025 | 01:09 AM
జిల్లా పోలీసు కార్యాలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగం గా ఏర్పాటుచేసిన విఘ్నేశ్వరుడికి ఎస్పీ మహేష్ బి. గీతే ప్రత్యేక పూజలు చేశారు.
సిరిసిల్ల క్రైం, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీసు కార్యాలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగం గా ఏర్పాటుచేసిన విఘ్నేశ్వరుడికి ఎస్పీ మహేష్ బి. గీతే ప్రత్యేక పూజలు చేశారు. ఆర్‌ఐలు, సిఐలు, ఎస్‌ఐలు , అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సిరిసిల్ల టౌన్ : జిల్లా కేంద్రంలోని పలు వార్డు ల్లో ప్రజలు బుధవారం మండపాల్లో గణనాథుడి ప్రతిమలను ప్రతిష్టించారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహించారు.
సిరిసిల్ల రూరల్ : సిరిసిల్ల అర్బన్ పరిధిలోని పలు గ్రామాల్లో బుధవారం గణనాథులు కొలువుదీరా యి. మండపాల్లో గణనాథులకు ప్రజలు ప్రత్యేక పూ జలు చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో మాజీ కౌన్సిలర్‌లు పోచవేణి సత్యఎల్లయ్యయాదవ్, లింగంపల్లి సత్యనా రాయణ, చేన్నమనేని కీర్తికమలాకర్‌రావు, భూక్యరెడ్డి నాయక్, గోల్లపల్లి బాలయ్యగౌడ్, బుర్ర లక్ష్మీశంకర య్య, మాజీ ఎంపీటీసీ బుర్రమల్లిఖార్జున్, చల్ల హరి కృష్ణ, ఎరవెళ్లి వెంకటరమణారావు పాల్గొన్నారు.